ఎంపీగా పోటీ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. పోటీ ఎక్కడి నుంచంటే..?

తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఆమె చెరగని ముద్ర వేసింది. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ నటి.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు తెరకు దూరమైంది. ఇప్పుడు మరో ఫేజ్ లోకి అడుగుపెడుతోంది అమ్మడు.

తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఆమె చెరగని ముద్ర వేసింది. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ నటి.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు తెరకు దూరమైంది. ఇప్పుడు మరో ఫేజ్ లోకి అడుగుపెడుతోంది అమ్మడు.

కొంత మంది హీరోయిన్లు తెరమరుగైనా.. అలా గుండె పొరల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. తెలుగు ఇండస్ట్రీ నుండి దూరం జరిగి కొన్నాళ్లు అవుతున్నా.. వారి సినిమాలు టీవీల్లో చూసినప్పుడల్లా అరే మంచి యాక్టర్ మిస్ అయ్యామని, ప్రస్తుతం ఏం చేస్తున్నారో అని ఆలోచన చేస్తుంటారు. అంతలో ఏదో ఒక వార్తతో స్వయంగా వారే తారసపడుతుంటారు. అలాంటి ఒకప్పటి స్టార్ నటీమణి.. రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటించడమే కాదు.. ఎంపీ స్థానానికి కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. రచనా బెనర్జీ. ‘కోవెల్లో దీపంలా.. తెలుగింటి కాంతరా, తొలి సంధ్య కాంతిరా’ అంటూ చక్రవర్తి ఓ అమ్మాయి గురించి వర్ణిస్తూ పాట పాడుతుంటారు. అందులో తన క్యూట్ లుక్స్‌తో కట్టి పడేసింది ఈ బెంగాలీ భామ.

రచనా బెనర్జీ అసలు పేరు ఝుమ్ ఝుమ్ బెనర్జీ.. 1994లో మిస్ కలకత్తాగా ఎంపికైన ఈ బ్యూటీ.. అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. బెంగాలీ చిత్రాల్లో కెరీర్ స్టార్ చేసిన రచనా.. ఒడియాతో పాటు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నేను ప్రేమిస్తున్నాను మూవీ తర్వాత కన్యాదానం హిట్ కొట్టడంతో వరుస పెట్టి సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, శ్రీకాంత్, జగపతి బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోల సరనస ఆడిపాడింది. తెలుగులో లాహిరీ లాహిరీ లాహిరీలో కనిపించిన ఆమె.. ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో నటించలేదు. తెలుగు, బెంగాల్, ఒడియా భాషల్లోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది రచన. సిద్దాంత్ మహోపాత్రను వివాహం చేసుకున్న ఈ నటి.. 2004లో అతడి నుండి విడిపోయింది.

2007లో ప్రోబల్ బసును వివాహం చేసుకోగా.. వీరికో కుమారుడు. 2016లో ఈ జంట విడిపోయింది. కాగా, రచనా ప్రస్తుతం బెంగాల్ టెలివిజన్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. దీదీ నంబర్ 1 జడ్జిగా వ్యవహరిస్తోంది అమ్మడు. అంతే కాకుండా.. రచనా క్రియేషన్స్ పేరుతో బిజినెస్ నడుపుతోంది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేయనుంది. హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతోంది. ఆమె పేరును టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా, ఇటీవల దీదీ నంబర్ 1 సీజన్ 9కి రియల్ దీదీ అతిధిగా విచ్చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది రచనా.. అంతలో ఆమె సీటు ఖరారు కావడం గమనార్హం. బీజెపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీపై రచనాను పోటీకి నిలబెట్టింది టీఎంసీ.

Show comments