iDreamPost
android-app
ios-app

పుష్ప-2 ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా.. గూస్ బంప్స్ వస్తున్నాయ్

పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 రూపుదిద్దుకుంటున్న సంగతి విదితమే. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 రూపుదిద్దుకుంటున్న సంగతి విదితమే. అయితే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

పుష్ప-2 ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా.. గూస్ బంప్స్ వస్తున్నాయ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం పుష్ప 2- ద రూల్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్, అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన టీజర్, రష్మిక మందన్న ఫస్ట లుక్ టీజర్ సినిమాపై మరింత హైప్స్ పెంచాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ బాక్సాఫీసును కూడా దున్నేయడానికి సిద్ధం అయ్యాడు అల్లు అర్జున్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేనీ, యలమంచిలి రవి కిశోర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా నుండి సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను ఎనౌన్స్ చేసింది. అనుకున్నట్లుగానే ఏప్రిల్ 24న సాయంత్రం లిరికల్ సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేటట్లే కనిపిస్తున్నాడు..పుష్ప.. పుష్ప పుష్ప..పుష్ప రాజ్ అంటూ సాగిపోయే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఇందులో కేవలం అల్లు అర్జున్ హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫుల్ సాంగ్ మే 1 ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక సినిమాలో పహాద్  ఫాజిల్, జగపతి బాబు, సునీల్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్, జగదీప్ ప్రతాప్ బండారీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేశారు. బన్నీ అమ్మవారి పాత్రలో కనిపించి గూస్ బంప్స్ తెప్పించిన సంగతి విదితమే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis