iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

  • Published Oct 03, 2024 | 6:12 PM Updated Updated Oct 03, 2024 | 6:12 PM

Pushpa 2, Trailer, Allu Arjun, Sukumar: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రాబోతున్న పుష్ప-2 ది రూల్‌కు సంబంధించి ఓ క్రేజ్‌ అప్డేట్‌ వచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Pushpa 2, Trailer, Allu Arjun, Sukumar: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రాబోతున్న పుష్ప-2 ది రూల్‌కు సంబంధించి ఓ క్రేజ్‌ అప్డేట్‌ వచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Oct 03, 2024 | 6:12 PMUpdated Oct 03, 2024 | 6:12 PM
అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

పుష్ప ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌పై క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది. పుష్పతో దేశాన్ని ఒక ఊపు ఊపేసి.. కలెక్షన్ల కనకవర్షం కురిపించిన అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబోలో రాబోతున్న పుష్ప-2 కోసం దేశం మొత్తం వెయింటింగ్‌. థియేటర్లలో ఎప్పుడెప్పుడు తగ్గదేలే అంటూ అరిచి గోల చేద్దామా అంటూ ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతకంటే ముందు.. పుష్ప-2 ట్రైలర్‌ ఎప్పుడొస్తుందా అని అంతా అడుగుతున్నారు. అలాంటి వారిని శాంత పరుస్తూ.. నవంబర్‌ రెండో వారంలో పుష్ప-2 ట్రైలర్‌ను లాంచ్‌ చేయాలని అల్లు అర్జున్‌-సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప ఇచ్చిన సక్సెస్‌, ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌తో పుష్ప-2పై భారీ ఎక్స్‌ప్టెషన్స్‌ ఉన్నాయి.

వాటిని అందుకోవాలంటే.. పుష్ప-2ను ఏ రేంజ్‌లో చెక్కాలో.. సుకుమార్‌కు బాగా తెలుసు. సినిమా కోసం ప్రాణం పెట్టే హీరోల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి హీరోతో పుష్ప లాంటి బ్లాక్‌ బాస్టర్‌, ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమాను తీసిన తర్వాత.. దాని పార్ట్‌-2గా వస్తున్న పుష్ప-2 ది రూల్‌ అంతకు మించి అనే అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవడానికి డైరెక్టర్‌ సుక్కు.. ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈసారి ప్రపంచాన్ని షేక్‌ చేయాలనే టార్గెట్‌తో.. పుష్ప-2కు తుదిమెరుపులు దిద్దుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎలాగో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది.. అంతకంటే ముందు ఇండియాను పుష్ప-2 ఫీవర్‌తో ఊగిపోయేలా చేయాలంటే.. అది ట్రైలర్‌ వల్లే అవుతుంది.

అందుకే ట్రైలర్‌ను ఒక మాస్టర్‌ పీస్‌గా కట్‌ చేసి.. అభిమానుల అంచనాలను డబుల్‌ చేసేది ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన టైటిల్‌ సాంగ్‌, సుసేకీ.. పాటలు వివపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప-2 నుంచి ఏ చిన్న అప్డేట్‌ వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. ఇప్పుడు ట్రైలర్‌ గురించి వచ్చిన వార్త కూడా దావానంలా వ్యాపించింది. మొత​ంగా నవంబర్‌ రెండో వారంలో పుష్ప-2 ట్రైలర్‌తో యూట్యూబ్‌ తగలబడిపోవడం ఖాయం. ఇప్పటి వరకు ఉన్న ట్రైలర్‌ రికార్డులన్ని పుష్ప-2 తుడిచిపెట్టేస్తుందని ఇప్పటికే అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఆర్మీ తల్చుకుంటే.. ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు. మరి ట్రైలర్‌ కోసం మీరెంతా వేయిట్‌ చేస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom