iDreamPost
android-app
ios-app

పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం బ్యూటీ ఫిక్స్! సమంతాని మించి!

  • Published Feb 21, 2024 | 7:27 PM Updated Updated Feb 21, 2024 | 7:27 PM

Pushpa 2 Item Song Update: పుష్ప 2 సినిమాపై ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ ఉంది. దానిని రెట్టింపు చేస్తూ మూవీ టీమ్ ప్లాన్స్ చేస్తోంది.

Pushpa 2 Item Song Update: పుష్ప 2 సినిమాపై ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ ఉంది. దానిని రెట్టింపు చేస్తూ మూవీ టీమ్ ప్లాన్స్ చేస్తోంది.

  • Published Feb 21, 2024 | 7:27 PMUpdated Feb 21, 2024 | 7:27 PM
పుష్ప-2లో ఐటెం సాంగ్ కోసం బ్యూటీ ఫిక్స్! సమంతాని మించి!

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2: ది రూల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిని ఏమాత్రం తగ్గించకుండా సుకుమార్- అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్త మార్కెట్ ని టార్గెట్ చేస్తూ పుష్ప 2 విషయంలో వ్యూహాలు రచిస్తున్నారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప 2 మూవీలో ఐటం సాంగ్ గురించి కూడా పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. ఏ హీరోయిన్ ఆ పాటలో ఉండబోతోంది అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక బ్యూటీ నేమ్ అయితే వైరల్ అవుతోంది.

పుష్ప ది రూల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రకంపనల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మూవీకి అంత హైప్ తీసుకొచ్చిన అంశాల్లో స్పెషల్ సాంగ్ కూడా ఒకటి అని చెప్పచ్చు. సమంత ఆ మూవీలో చేసిన ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా..’ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ సాంగ్ లో బన్నీ- సమంత చేసిన డాన్స్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో యాక్షన్, స్టోరీ, ఎలివేషన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో.. అలాగే ఐటం సాంగ్ గురించి కూడా అలాగే చర్చిస్తున్నారు.

ఈసారి సాంగ్ ఉంటే.. ఏ బ్యూటీతో ఆ పాట చేయిస్తారు అంటూ చాలా రోజుల నుంచే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ డౌటనుమానం తీరిపోయింది అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ ఒక బాలీవుడ్ బ్యూటీని ఈ సాంగ్ కోసం సెలక్ట్ చేసినట్లు చెబుతున్నారు. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ పుష్ప ది రూల్ మూవీలో ఐటం సాంగ్ చేయబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ కోసం నోరా భామ రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే ఛార్జ్ చేయబోతోంది అంటున్నారు. సమంత చేసిన పాటకు రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని అప్పట్లే పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడు నోరాకి కూడా అంతకు తగ్గకుండానే ముట్ట చెప్పబోతున్నారు అంటున్నారు. సాధారణంగానే నోరా ఫతేహీ సాంగ్ కు రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. ఇంత హైప్ ఉన్న మూవీ కాబట్టి ఇంకా ఎక్కువే తీసుకునేందుకు ఆస్కారం లేకపోలేదు. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Nora fatehi finalised to pushpa 2 item song

మూవీకి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అధికారికంగా ప్రకటించిన ఆగస్టు 15 డేట్ కే పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ధృవీకరిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు తీసుకెళ్తున్నాం అని స్వయంగా అల్లు అర్జున్ అంతర్జాతీయ వేదికపై ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం రెండు పార్టులతో ఈ మూవీ ఆగిపోయేది కాదు. దీనిని ఫ్రాంచైజ్ చేసేందుకు మేకర్స్ ఇప్పటికే సన్నహాలు షురూ చేశారు. మరి.. పుష్ప 2 సినిమాలో బన్నీ సరసన నోరా ఫతేహీ ఐటమ్ సాంగ్ చేయబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom