iDreamPost
android-app
ios-app

Director Sukumar: పుష్ప 2.. ఒత్తిడి మెుత్తం సుకుమార్ పైనే ఉందా?

  • Published Jul 23, 2024 | 1:47 PM Updated Updated Jul 23, 2024 | 1:47 PM

పుష్ప 2 మూవీ అనుకున్న టైమ్ కి అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇక ఈ ఒత్తిడి అంతా డైరెక్టర్ సుకుమార్ పైనే ఉందంటున్నారు సినీ పండితులు.

పుష్ప 2 మూవీ అనుకున్న టైమ్ కి అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇక ఈ ఒత్తిడి అంతా డైరెక్టర్ సుకుమార్ పైనే ఉందంటున్నారు సినీ పండితులు.

  • Published Jul 23, 2024 | 1:47 PMUpdated Jul 23, 2024 | 1:47 PM
Director Sukumar: పుష్ప 2.. ఒత్తిడి మెుత్తం సుకుమార్ పైనే ఉందా?

పుష్ప 2.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటికే ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కు వాయిదా పడిన ఈ మూవీ.. అనుకున్న టైమ్ కు వస్తుందా? రాదా? బ్యాలెన్స్ షూటింగ్ ఇంకెంతుంది? సుకుమార్ వెకేషన్ నుంచి వచ్చాడా? లేదా? ఇన్ని ప్రశ్నలు బన్నీ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే పుష్ప 2 మూవీ కంప్లీట్ అయ్యేందుకు ఒత్తిడి మెుత్తం ఒక్క సుకుమార్ పైనే ఉందంటున్నారు సినీ పండితులు. మరి ఆ భారం మెుత్తం సుకుమార్ ఒక్కడే ఎలా డీల్ చేస్తాడు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పుష్ప 2 మూవీ అనుకున్న టైమ్ కి అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎందుకంటే? ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. అదికూడా బన్నీ-ఫాహద్ ఫజిల్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 30 రోజులు అన్నకాడ.. ఇంకో20 రోజులు ఎక్కువే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నటుల కాల్షీట్లు అడ్జెస్ట్ కాకపోవడం లాంటి సమస్యలు తలెత్తడం కామన్. ఇక ప్రస్తుతం సుకుమార్ తొలి భాగం లాక్ చేసే పనిలో ఉన్నారట. ఆగస్ట్ చివరిలోగా ఫస్టాఫ్ ను కంప్లీట్ చేయనున్నట్లు టాక్. అయితే ఇంకా 90 రోజుల గ్యాప్ లో సెకండాఫ్ ను లాక్ చేయాలని భావిస్తున్నాడు.

ఇక సుకుమార్ మూవీ కాబట్టి కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ తో దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లో ఫస్టాఫ్ కు మ్యూజిక్ అందిస్తే.. ఆ తర్వాత నవంబర్ లో సెకండాఫ్ కు అందించే అవకాశం ఉంది. అసలు విషయం ఏంటంటే? బన్నీ-ఫహద్ పై తెరకెక్కించే సీన్లను ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే.. సుకుమార్ కు అంత భారం తగ్గుతుంది. కానీ ఇక్కడ తన స్టైల్ టేకింగ్ కు భిన్నంగా ఇంకాస్త స్పీడ్ గా షూటింగ్ ను కంప్లీట్ చేయాలి. అయితే ఇది కాస్త ఒత్తిడితో కూడుకున్నదే. సుక్కు తలచుకుంటే.. పుష్ప 2 అనుకున్న టైమ్ కు రావడం అన్నది పాజిబులే. కానీ ఈ క్రమంలో మూవీ భారాన్నంత మోయాల్సిన బాధ్యత సుకుమార్ పైనే ఉంది. సుకుమార్ తలచుకుంటే ఇది సాధ్యం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేద. మరి పుష్ప 2 భారం మోసి.. ప్రేక్షకుల ముందుకు కరెక్ట్ టైమ్ కు తీసుకొస్తాడో? లేడో? వేచి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom