iDreamPost
android-app
ios-app

Shivam Bhaje Trailer Review: శివం భజే ట్రైలర్ ఔట్.. BGMకి గూస్ బంప్స్ పక్కా

  • Published Jul 23, 2024 | 12:40 PM Updated Updated Jul 23, 2024 | 12:40 PM

అశ్విన్ బాబు హీరోగా వస్తున్న మూవీ శివం భజే. గంగా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మిస్తున్నాడు. అప్సర్ దర్శకుడు. దివ్యాంగన సూర్యవంశీ హీరోయిన్. ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.. ఎలా ఉందంటే..?

అశ్విన్ బాబు హీరోగా వస్తున్న మూవీ శివం భజే. గంగా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మిస్తున్నాడు. అప్సర్ దర్శకుడు. దివ్యాంగన సూర్యవంశీ హీరోయిన్. ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.. ఎలా ఉందంటే..?

  • Published Jul 23, 2024 | 12:40 PMUpdated Jul 23, 2024 | 12:40 PM
Shivam Bhaje Trailer Review: శివం భజే ట్రైలర్  ఔట్.. BGMకి గూస్ బంప్స్ పక్కా

యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. జీనియస్ మూవీతో కెరీర్ స్టార్ అయ్యింది. గత ఏడాది హిడింబతో ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమౌతున్నాడు అశ్విన్. ఆయన నుండి రాబోతున్న మూవీ శివం భజే. గంగా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మిస్తున్నాడు. అప్సర్ దర్శకుడు. దివ్యాంగన సూర్యవంశీ హీరోయిన్. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్, టీచర్ లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ఈవెంట్‌కు విచ్చేశారు తమన్, అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్. ఈ ముగ్గురి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలయ్యింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ఈమూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వికాస్ బడిశ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్టు 1న మూవీ విడుదల కానుంది.

 ‘వరల్ట్ మ్యాప్‌లో ఇండియా కనుమరుగైపోవాలి’ అంటూ ట్రైలర్ మొదలైంది. భారత్ కు ఏదో పెను ముప్పు వాటిల్లబోతుందని సమాచారం.. దాన్ని చేధించేందుకు ఏజెంట్ నియమించినట్లు కనిపిస్తుంది. అలాగే మిస్ట్రీరియస్ మర్డర్స్.. వాటిని ఎవరు చేస్తున్నారని క్యూరియాసిటీ నిండిపోతుంది. మాస్ ఎలివేషన్లలో కనిపిస్తున్నాడు అశ్విన్ బాబు. ‘నీ వెనుక ఉండి నడిపిస్తున్న ఆ గుంట నక్కల గురించి కూడా తెలుసురా’ అంటూ అశ్విన్ సంభాషణలు ఉన్నాయి. ట్రైలర్ బీజీఎం అదిరిపోయింది. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇక ట్రైలర్ చివరిలో శివుని వీఎఫ్ఎక్స్ వావ్ అనిపిస్తుంది. ఈ మూవీలో కూడా మైథాలజీ టచ్ కనిపిస్తుంది.

ఈ సందర్భంగా అనిల్ రావి పూడి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. అశ్విన్ నాకు బ్రదర్ లాంటి వాడు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. టీంకి ఆల్ ది బెస్ట్ ’ అని చెప్పాడు. తమన్ మాట్లాడుతూ.. ‘టాలెంట్ ఉంటే సరిపోదు.. దానితో పాటు ఓ కసి ఉండాలి’ అంటూ అశ్విన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఈ ట్రైలర్ చూశాక.. పగడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. ఈ మ్యూజిక్ వింటుంటే.. కడుపులో అదురుతుంది. నీ కెరీర్‌లో శివం భజేకి ముందు.. శివం భజేకి తర్వాత అన్నట్లుగా మారుతుంది. ఈ మూవీ ఆ గస్టు 1 అశ్విన్ పుట్టిన రోజు నాడే విడుదల అవుతుంది. హిట్ ఇచ్చి గిప్ట్ ఇవ్వండి’ అని కోరాడు విశ్వక్. ట్రైలర్ అయితే మంచి రెస్సాన్స్ ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ కానుంది. కంటెంట్ ఉంటే.. కచ్చితంగా హిట్ కావడం పక్కా.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş