iDreamPost
android-app
ios-app

పుష్ప 2 నుంచి క్రేజీ అప్ డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

  • Published Aug 28, 2024 | 3:45 PM Updated Updated Aug 28, 2024 | 3:45 PM

Pushpa 2 Movie New Update: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు టీమ్ ఒక కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది.

Pushpa 2 Movie New Update: అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు టీమ్ ఒక కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది.

  • Published Aug 28, 2024 | 3:45 PMUpdated Aug 28, 2024 | 3:45 PM
పుష్ప 2 నుంచి క్రేజీ అప్ డేట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!

పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదేలే. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక సంచలనం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోకి పాన్ ఇండియా లెవల్లో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పుష్ప రాజ్ తన రూల్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాడా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నా కూడా.. బెటర్ అవుట్ పుట్ వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కి పుష్ప టీమ్ ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. నిజానికి అది సర్ ప్రైజ్ అనే కంటే.. భరోసా అని చెప్పచ్చు.

పుష్పరాజ్ తన రూల్ డిసెంబర్ 6 నుంచి మొదలు పెడతాడు అని ముందుగానే ప్రకటించారు. సినిమాని వాయిదా వేసిన సమయంలో అసలు విషయం కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత పుష్ప 2 సినిమాకి సంబంధించి చాలానే ఊహాగానాలు, గాసిప్స్ వచ్చాయి. డిసెంబర్ 6 నుంచి కూడా సినిమా వాయిదా పడుతుందని చాలానే పుకార్లు వచ్చాయి. అలాంటి తరుణంలో కాస్త బన్నీ ఫ్యాన్స్ విస్మయంలో పడిపోయారు. ఇప్పుడు వచ్చిన అప్ డేట్ ఏంటంటే.. పుష్పరాజ్ రూల్ కి సంబంధించి అనమాట. మూవీ టీమ్ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో సినిమా రిలీజ్ కి సంబంధించి మరోసారి క్లారిటీ ఇస్తూ.. అభిమానులకు భరోసా కల్పించారు.

కొత్తగా వచ్చిన పోస్టర్ లో పుష్పరాజ్ రూల్ మరో 100 రోజుల్లో ప్రారంభం అవుతుంది అని చెప్పారు. అంటే సినిమా డిసెంబర్ 6వ తారీఖున వస్తోంది అనే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సినిమా మరోసారి వాయిదా పడే ప్రసక్తి లేదు అనే విషయాన్ని నమ్మకంగా చెబుతున్నారు. ఇంక ఆ పోస్టర్ చూస్తే.. చేతికి కడియాలు, వేళ్లనిండా ఉంగరాలు, పొడవైన జుట్టుతో పుష్పరాజ్ ఒక రూలర్ లాగానే కనిపిస్తున్నాడు. పార్ట్ 1లో చూసింది కేవలం పుష్పరాజ్ యాటిట్యూడ్ కి ట్రైలర్ మాత్రమే. కానీ, పార్ట్ 2లో అతని తెలివితేటలు, యాటిట్యూడ్, ఎమోషన్స్ అన్నీ బిగ్ సైజ్ లో చూపించబోతున్నారు. అలాగే సినిమా ఏపీ నుంచి జపాన్ వరకు వెళ్లనుంది. అందుకే పార్ట్ 2 కోసం అభిమానులు అంతలా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 మేకర్స్ కూడా.. చాలా జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom