iDreamPost
android-app
ios-app

పుష్ప2 రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు.. ?

  • Published Oct 24, 2024 | 10:56 AM Updated Updated Oct 24, 2024 | 10:56 AM

Pushpa 2 Release Date: వరల్డ్ వైడ్ గా బాగా బజ్ క్రియేట్ చేస్తుంది పుష్ప 2 మూవీ. ఇప్పటికే సినిమా డేట్ ఆల్రెడీ ఆలస్యం అయింది. దీనితో అభిమానులు కాస్త అప్సెట్ అయిన మాట వాస్తవం. ఫైనల్ గా దానిని డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

Pushpa 2 Release Date: వరల్డ్ వైడ్ గా బాగా బజ్ క్రియేట్ చేస్తుంది పుష్ప 2 మూవీ. ఇప్పటికే సినిమా డేట్ ఆల్రెడీ ఆలస్యం అయింది. దీనితో అభిమానులు కాస్త అప్సెట్ అయిన మాట వాస్తవం. ఫైనల్ గా దానిని డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

  • Published Oct 24, 2024 | 10:56 AMUpdated Oct 24, 2024 | 10:56 AM
పుష్ప2 రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు.. ?

అసలు ఇప్పటివరకు ట్రైలర్ , సాంగ్స్ రిలీజ్ కాకుండానే పుష్ప మ్యానియా ఈ రేంజ్ లో ఉంది. ఇక ఒక్కసారి అప్డేట్స్ వదలడం స్టార్ట్ చేస్తే.. అభిమానులను ఆపడం ఎవరి వలన కాదు. అయితే ప్రస్తుతం పుష్ప టీం అంతా కూడా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే మేకర్స్ చెప్పిన రిలీజ్ డేట్ కు ఇంకా ఎంతో సమయం లేదు. ఓ వైపు షూటింగ్ పూర్తి కాలేదు. మరో వైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీనితో టీం అంతా కూడా వీలైనంత త్వరగా వీటిని ఫినిష్ చేయడానికి చూస్తున్నారు . ఆల్రెడీ మీడియా సోషల్ మీడియాలో పుష్ప సునామి సృష్టిస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో ట్రోలర్స్ ను నోటి మీద వేలు వేసుకునేలా చేసింది. పైగా బుక్ మై షో, పేటిఎం ల లో కూడా తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ రెచ్చిపోతున్నాడు. ఈ రెండిటిలో కలిపి ఏకంగా 7 లక్షల మంది ఇంట్రెస్ట్స్ ను ఈ మూవీ నమోదు చేసుకుంది.

దీనితో పుష్ప గాడి రూల్ మరో లెవెల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అసలైతే ముందుగా చెప్పిన టైం కు రిలీజ్ చేసి ఉంటే కనుక.. ఈపాటికి పుష్ప క్రియేట్ చేసిన రికార్స్డ్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ ఊహించని విధంగా సినిమాను డిసెంబర్ 6 కు పోస్ట్ పోన్ చేశారు. దీనితో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయినా సరే సినిమా మీద అంచనాలు మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. సరే చెప్పినట్లుగా డిసెంబర్ 6 న సినిమా రిలీజ్ అవుతుందిలే అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ పుష్ప 2 టీం మరోసారి షాక్ ఇచ్చింది. సినిమాను చెప్పిన టైం కు రిలీజ్ చేయడం లేదట. కానీ ఈసారి నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే , పుష్ప 2 మూవీ ఈసారి చెప్పిన టైం కంటే ఓ రోజు ముందుగానే థియేటర్ లో సందడి చేయబోతుందట. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అంటే దానికంటే ముందుగానే డిసెంబర్ 4 న పుష్ప 2 ప్రీమియర్స్ ను చూడొచ్చని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వనున్నారు.

కానీ అటు షూటింగ్ చూస్తే ఇంకా పూర్తి కాలేదు. నవంబర్ 2 వ వారం వరకు మూవీ షూటింగ్ జరుగుతుందని టాక్ నడుస్తుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాగూ ఉంటాయి. ఇన్ని లాస్ట్ మినిట్ వర్క్స్ లో.. కనీసం డిసెంబర్ 6 న రిలీజ్ చేసినా చాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇంతలోనే వారికి షాక్ ఇచేలా ఓ రోజు ముందుగా రిలీజ్ చేస్తాం అంటున్నారు మేకర్స్. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. వరల్డ్ వైడ్ గా మోస్ట్ అవైటెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న పుష్ప 2.. రిలీజ్ తర్వాత అందరి అంచనాలను నిలబెట్టుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.  ఇవన్నీ తెలియాలంటే
మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet