iDreamPost
android-app
ios-app

Pushpa-2: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బన్నీ! పుష్ప 2కు భారీ డీల్..

విడుదలకు ముందే పుష్ప 2తో బన్నీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. భారీ డీల్ తో అక్కడి మార్కెట్ ను అల్లాడిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విడుదలకు ముందే పుష్ప 2తో బన్నీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. భారీ డీల్ తో అక్కడి మార్కెట్ ను అల్లాడిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Pushpa-2: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బన్నీ! పుష్ప 2కు భారీ డీల్..

పుష్ప 2.. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే చిత్రాల్లో వన్ ఆఫ్ ది మూవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో.. అంతకు మించి ఉండేలా పుష్ప 2 చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు సుకుమార్. అయితే విడుదలకు ముందే పుష్ప 2తో బన్నీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. భారీ డీల్ తో అక్కడి మార్కెట్ ను అల్లాడిస్తున్నాడు.

పుష్ప 2 కోసం టాలీవుడ్ ప్రేక్షకులే కాక.. ఇండియా వైడ్ గా ఉన్న సగటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సృష్టించిన విధ్వంసం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. ఇండియా వైడ్ గా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. అందుకు తగ్గట్లుగానే డైరెక్టర్ సుకుమార్ సైతం పుష్ప 2ను జక్కన్న మాదిరి చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ క్లైమాక్స్ కోసం మూడు వెర్షన్స్ ను సిద్ధం చేసి.. ఫైనల్ వెర్షన్ షూటింగ్ కు వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రచ్చ చేయాడనికి వస్తున్నాడు పుష్ప రాజ్.

అయితే విడుదలకు ముందే బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు బన్నీ. పుష్ప 2కు ఉన్న హైప్ తో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీగా థియేట్రికల్ బిజినెస్ చేస్తోందని టాక్. అదీకాక ఒక్క హిందీ వెర్షన్ లోనే రికార్డ్ స్థాయి బిజినెస్ జరిపినట్లు సమాచారం. హిందీ వెర్షన్ లో రూ. 250 కోట్ల బిజినెస్ జరిగిందని టాక్. ఇది భారీ డీల్ అనే చెప్పాలి. బన్నీ దెబ్బకు అక్కడి మార్కెట్ షేక్ అవుతోంది. మరి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగాక.. అక్కడ ఏ స్థాయిలో పుష్ప రాజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మరి బాలీవుడ్ ను షేక్ చేస్తూ.. భారీ డీల్ దక్కించుకున్న పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి