iDreamPost
android-app
ios-app

హుర్రే.. ప్రాజెక్ట్- K నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది!

  • Author ajaykrishna Published - 03:36 PM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 03:36 PM, Wed - 19 July 23
హుర్రే.. ప్రాజెక్ట్- K నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. సైన్స్ ఫిక్షన్ జానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజయంతి ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటిదాకా 80% పైగా షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో ఊహించని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ వరల్డ్ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ప్రాజెక్ట్ కే నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ టైటిల్, టీజర్ రిలీజ్ కి టైం దగ్గరపడింది. ఇక ప్రాజెక్ట్ కే టైటిల్, టీజర్ లను USAలోని శాన్ డియాగో COMICCONలో ఆవిష్కరించనున్నారు. జులై 20న గ్రాండ్ ఈవెంట్ తో.. ప్రాజెక్ట్ కే టైటిల్ టీజర్ రిలీజ్ అవుతున్నాయి. కాగా.. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్, ప్రభాస్, దీపికాపదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ USAకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమా నుండి టీజర్ ని ముందుగా అమెరికాలో.. తర్వాత రోజు జులై 21న ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు ‘కాలచక్ర’ అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా నుండి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ఇప్పుడు కొత్తగా జులై 19న డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎంతో ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి ప్రభాస్ లుక్ ఆద్యంతం సినిమాపై ఆసక్తి రేపే విధంగా ఉంది. అయితే.. ఈ సినిమాలో అసలు ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూడని నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్.. నాగ్ అశ్విన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉందని చెప్పాలి. ప్రభాస్ ఫస్ట్ టైమ్ సూపర్ హీరో రోల్ ప్లే చేస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్ లే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటూ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి ప్రాజెక్ట్ కే మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibom