పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందుకు కారణం.. ఒకటి సలార్ టీజర్ అయితే.. రెండోది ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్. ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఆల్రెడీ సలార్ టీజర్ తో ఫుల్ కిక్ ఇచ్చిన ప్రభాస్.. ఇక తాజాగా ప్రాజెక్ట్ కే గ్లింప్స్ తో డబుల్ కిక్ ఇచ్చాడని చెప్పాలి. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సెట్ చేయలేకపోయాయి. కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా.. ఫుల్ నెగిటివిటీని ఫేస్ చేశాయి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు. కానీ.. ఈసారి ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో.. ప్రాజెక్ట్ కే మూవీని తీసుకొస్తున్నాడు ప్రభాస్.
ఎట్టకేలకు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కే మూవీకి.. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అమెరికాలో జరుగుతున్న ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీంతో శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలో లాంచ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా.. కల్కి 2898 ఏడీ రికార్డు నమోదు చేసింది. ప్రభాస్, కమల్ హాసన్, అశ్వనీదత్, నాగ్ అశ్విన్ లతో పాటు రానా దగ్గుబాటి ఆ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. ప్రపంచాన్ని పెనుచీకటి కమ్మేసినప్పుడు.. ఓ అద్భుత శక్తి పుట్టుకొస్తుంది. అంతం అరంభమవుతుంది’ అని గ్లింప్స్‌లో చూపించారు. గ్లింప్స్ లో డైలాగ్స్ లేవు. కానీ.. విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది కల్కి టీజర్.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి పాత్ర ప్లే చేస్తుండగా.. కల్కితో కలిసి దుష్టశక్తిని అంతం చేసే అశ్వద్ధామ క్యారెక్టర్ లో బిగ్ బి అమితాబ్ కనిపించనున్నాడు. అయితే.. వేదాల ప్రకారం కల్కికి గురువు పరశురాముడు. మరి ఆ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. పైగా నాగ్ అశ్విన్ ఎంచుకున్న స్టోరీ లైన్ కూడా ఒక్కసారిగా ఇండియన్ మైథాలజీ మూవీస్ ని షేక్ చేసేలా ఉండటం విశేషం. సైన్స్ ఫిక్షన్ మైథోలాజికల్ టచ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ వారు మూవీని విజువల్ వండర్ గా నిర్మిస్తున్నారు. మరి ప్రాజెక్ట్ కే కల్కి గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.