iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోలకు భారీ పారితోషికం.. నిర్మాతల ధైర్యానికి కారణం?

  • Published Jul 17, 2024 | 4:50 PM Updated Updated Jul 17, 2024 | 4:50 PM

ప్రస్తుతం హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సందేహించడంలేదు నిర్మాతలు. అయితే ప్రొడ్యూసర్స్ ధైర్యానికి కారణం ఒకటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సందేహించడంలేదు నిర్మాతలు. అయితే ప్రొడ్యూసర్స్ ధైర్యానికి కారణం ఒకటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోలకు భారీ పారితోషికం.. నిర్మాతల ధైర్యానికి కారణం?

టాలీవుడ్ లో సినిమాల టేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెరకెక్కుతున్న అన్ని సినిమాలు దాదాపు పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. దాంతో బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు సినిమాను గ్రాండియర్ గా తీసుకురావడానికి మేకర్స్ ఏ మాత్రం భయపడటం లేదు. అదీకాక హీరోలకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. మరి హీరోలకు ఈ రేంజ్ లో పారితోషికాలు ఇవ్వడం వెనక నిర్మాతల ధైర్యం ఏంటి? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీస్ అన్నీ దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. పాన్ ఇండియా రేంజ్ అంటే బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బడ్జెట్ లో సింహభాగం హీరోల రెమ్యూనరేషన్స్ కే వెళ్తుంది. మరి స్టార్ హీరోలకు రూ. 100, 200 కోట్లు ఇవ్వడానికి సైతం నిర్మాతలు వెనకడుగు వెయ్యట్లేదు. దాని వెనకాల వారికి ఓ ధైర్యం ఉంది.  అదేంటంటే? భారీ పారితోషికం అంటే అందరికి గుర్తుకు వచ్చే హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అతడు కల్కి మూవీకి రూ. 150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయినా ఇది డార్లింగ్ స్థాయికి తక్కువే అంటున్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే? ప్రభాస్ మూవీస్ కు డిజిటల్, శాటిలైట్, నాన్ థియేట్రికల్, డబ్బింగ్, ఆడియో అంటూ దాదాపు రూ. 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. అదీకాక థియేట్రికల్ బిజినెస్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ప్రభాస్ సినిమాలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దాంతో భారీ బిజినెస్ జరిగి తమకు లాభాలు వస్తాయన్న ధైర్యంతో ఇంత మెుత్తంలో భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అంటున్నారు ప్రొడ్యూసర్స్. ఇది ఒక్క ప్రభాస్ కే కాదు.. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలందరికి వర్తించే నియమం. నిర్మాతలు అందరూ ఈ లెక్కలు వేసుకొనే స్టార్ హీరోలకు ఆ స్థాయిలో పారితోషికాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.