iDreamPost
android-app
ios-app

రాజమౌళిపై బాహుబలి ప్రొడ్యూసర్ కౌంటర్! వైరల్ అవుతున్న ట్వీట్!

  • Author ajaykrishna Published - 01:54 PM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 01:54 PM, Sat - 22 July 23
రాజమౌళిపై బాహుబలి ప్రొడ్యూసర్ కౌంటర్! వైరల్ అవుతున్న ట్వీట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సరికొత్త మూవీ ‘కల్కి'(Kalki 2898 AD). పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అత్యధిక భాషలలో రిలీజ్ కాబోతున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించనుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా.. కల్కి అని అధికారికంగా ప్రకటించే సరికి ఫ్యాన్స్ అందరు ఫుల్ హ్యాపీ అయిపోయారు.

ఇక కల్కి గ్లింప్స్.. ప్రభాస్ క్యారెక్టర్.. ఆ విజువల్స్ చూశాక ఫ్యాన్స్ ఆనందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఆ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీంతో వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ అందరిలోనూ కల్కి మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా బిగ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు వైజయంతి ప్రొడక్షన్స్ వారు. ఈ క్రమంలో అందరితో పాటు దర్శకధీరుడు రాజమౌళి సైతం కల్కి గ్లింప్స్ పై స్పందించాడు. కల్కి పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారి రివర్స్ ఆయనపైనే కౌంటర్స్ వేసే పరిస్థితి నెలకొంది. ఫ్యాన్స్ తో పాటు బాహుబలి ప్రొడ్యూసర్ శోభూ యార్లగడ్డ కూడా రాజమౌళిపై కౌంటర్ వేయడం ఆకట్టుకుంటున్న విషయం.

అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. కల్కి గ్లింప్స్ చూశాక రాజమౌళి.. “గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టం. దాన్ని మీరు సాధ్యం చేసి చూపించారు. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కానీ ఒకే ఒక్క ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు” అంటూ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ పై బాహుబలి ప్రొడ్యూసర్ శోభూ యార్లగడ్డ రియాక్ట్ అవుతూ.. “రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారో చూడండి” అని కౌంటర్ వేశాడు. దీంతో ఆయన కౌంటర్ కి రాజమౌళి బ్రహ్మి పిక్ తో ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం వీళ్ల ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాజమౌళి, శోభూ యార్లగడ్డ ఫన్నీ కన్వర్సేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet