iDreamPost
android-app
ios-app

Ravi Shankar: పవన్ స్మగ్లింగ్ కామెంట్స్ పై.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

  • Published Aug 30, 2024 | 3:03 PM Updated Updated Aug 30, 2024 | 3:03 PM

Producer Ravi Shankar Clarity About Pawan Kalyan Smuggling Comments: ఈ మధ్య సినిమాల్లో హీరోలు స్మగ్లర్ల పాత్రలు పోషిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Producer Ravi Shankar Clarity About Pawan Kalyan Smuggling Comments: ఈ మధ్య సినిమాల్లో హీరోలు స్మగ్లర్ల పాత్రలు పోషిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Aug 30, 2024 | 3:03 PMUpdated Aug 30, 2024 | 3:03 PM
Ravi Shankar: పవన్ స్మగ్లింగ్ కామెంట్స్ పై.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

“ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోలు స్మగ్లర్లుగా నటిస్తున్నారు” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ కామెంట్స్ ‘పుష్ప2’ మూవీని టార్గెట్ చేస్తూ ఉన్నాయని చాలా మంది వ్యాఖ్యానించారు. కాగా.. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ పై ప్రముఖ నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘మత్తు వదలరా 2’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

‘మత్తు వదలరా 2’.. రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరు, సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రూల్ లో నటిస్తున్న మూవీ. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా.. ఈ టీజర్ లాంచ్ వేడుకలో ప్రొడ్యూసర్ రవిశంకర్ కు పవన్ కళ్యాణ్ చేసిన స్మగ్లింగ్ కామెంట్స్ పై ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ..”పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం వేరు. మీరు దానిని ఆ సినిమాకు, ఈ సినిమాకు ఆపాదించి చూస్తున్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసే మనిషి అసలు కానేకాదు. సినిమాల గురించి తక్కువ చేసేలా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాట్లాడరు. ఏదో ఫ్లోలో ఆయన అలా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. అలాగే మూవీ రిలీజ్ సమయంలో కూడా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి దూరం ఉండదు” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ను పంచుకున్నారు నిర్మాత రవిశంకర్. పుష్ప 2 కచ్చితంగా డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని, సెప్టెంబర్ 2కి ఫస్టాఫ్, అక్టోబర్ లో సెకండాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తారు. నవంబర్ 20కి ఫస్ట్ కాపీ సిద్ధం అవుతుందని ఆయన తెలిపారు. అలాగే రాబోయే రెండు నెలల్లో రెండు పాటలు రిలీజ్ చేస్తామని, డిసెంబర్ 5న పుష్ప 2 ప్రీమియర్లు వేసే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా సెప్టెంబర్ 2న ఒక స్పెషల్ అప్డేట్ ఉంటుందని పండగలాంటి న్యూస్ చెప్పారు రవిశంకర్. మరి పవన్ వ్యాఖ్యలపై నిర్మాత ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet