iDreamPost
android-app
ios-app

ఆ టాప్ డైరెక్టర్ తో ఘట్టమనేని మరో వారసుడి ఎంట్రీ..

  • Published May 19, 2025 | 4:33 PM Updated Updated May 19, 2025 | 4:33 PM

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత వారి కుటుంబం నుంచి ఒక్కొక్కరికి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు . ప్రసుత్తం మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత వారి కుటుంబం నుంచి ఒక్కొక్కరికి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు . ప్రసుత్తం మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.

  • Published May 19, 2025 | 4:33 PMUpdated May 19, 2025 | 4:33 PM
ఆ టాప్ డైరెక్టర్ తో ఘట్టమనేని మరో వారసుడి ఎంట్రీ..

సూపర్ స్టార్ మహేష్ సోదరుడు , నిర్మాత రమేష్ బాబు కుమారుడు.. ఘట్టమనేని జయకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ హీరోను డైరెక్టర్ అజయ్ భూపతి లంచ్ చేయనున్నారట. తెలుగులో మంగళవారం , RX-100 లాంటి హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేసి.. మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే టాలీవుడ్ ఘట్టమనేని కుటుంబానికి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ బాబు , సితార , గౌతమ్ లను కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో వారసుడిని కూడా ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తీరాల్సిందే. జయకృష్ణ ఇప్పటికే నటనలో శిక్షణ పూర్తిచేసుకున్నాడని.. మొదటి చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకోడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయట.

వైజయంతీ మూవీస్ నుంచి జగదేకవీరుడు అతిలోక సుందరి , మహర్షి , కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అటు ఆనంది ఆర్ట్స్ నుంచి కూడా ఇలాంటి మంచి చిత్రాలే వచ్చాయి. సో ఇక ఇప్పుడు ఈ రెండు ప్రొడక్షన్ హౌస్ లు కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి రెడీ అవుతున్నాయి. ఈ లెక్కన సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్. కథను అజయ్ భూపతి ఇప్పటికే సిద్ధం చేశారట. సో ఘట్టమనేని జయకృష్ణ ఇండస్ట్రీలో తన మార్క్ ను ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి. దీనికి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.