iDreamPost
android-app
ios-app

ఆ హీరోయిన్ ఐరన్ లెగ్.. త్రివిక్రమ్ చెబితే పెట్టుకున్నాం!: అశ్విని దత్

  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 31 August 23
ఆ హీరోయిన్ ఐరన్ లెగ్.. త్రివిక్రమ్ చెబితే పెట్టుకున్నాం!: అశ్విని దత్

ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలకు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. వారి కాంబినేషన్ లో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ పడితే.. ఆ బంధం మరింత బలపడుతుంది. అయితే.. ప్లాప్స్ పడినా.. హిట్స్ లో ఉన్నా కొన్ని కాంబోల స్నేహం అలాగే ఉంటుంది. టాలీవుడ్ లో అలాంటి స్నేహం ఉన్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి – నిర్మాత అశ్వినీ దత్ లది ఒకటి. వీరి కాంబినేషన్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తెరపైకి వచ్చాయి. అలా మూడు వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన కాంబో.. నాలుగో సినిమా ‘జై చిరంజీవ’తో నిరాశపరిచింది. ఆ టైమ్ లో త్రివిక్రమ్ – డైరెక్టర్ విజయ్ భాస్కర్ ల కాంబినేషన్ సూపర్ ఫామ్ లో ఉంది.

మొత్తానికి చిరంజీవి – అశ్వినీ దత్ లతో త్రివిక్రమ్ – విజయ్ భాస్కర్ కాంబినేషన్ సెట్ అయి.. జై చిరంజీవ తెరపైకి వచ్చింది. క్రేజీ కాంబినేషన్ వలన భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కి నష్టాలు మిగిల్చిన సినిమాలలో జై చిరంజీవ ఒకటిగా నిలిచింది. అయితే.. జై చిరంజీవ ప్లాప్ విషయంలో అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్లాప్ గురించి ఆయన మాట్లాడుతూ.. “ఆ సినిమా ఎందుకో మిస్ ఫైర్ అయ్యింది. టీమ్ అంతా అమెరికాకు వెళితే.. త్రివిక్రమ్ కూడా రావాల్సింది. కానీ.. అతనికి నువ్వే నువ్వే మూవీ డైరెక్షన్ ఛాన్స్ రావడంతో.. రాలేకపోయాడు.

ఆ టైమ్ లో హీరోయిన్ సమీరా రెడ్డి ఓ ఐరన్ లెగ్. త్రివిక్రమ్ చెప్పడం వల్లే ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాం. ఎందుకంటే.. ఆమెను దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలు రాసానని త్రివిక్రమ్ చెప్పాడు. కానీ.. తీరా సినిమాలో ఆమె సీన్స్ అసలు బాగా రాలేదు. మంచి మంచి సీన్స్ చాలా ఉన్నాయి. కానీ.. ఒక్కటీ వర్కౌట్ కాలేదు. ఆ సినిమాకు మణిశర్మ కూడా మా కాంబినేషన్ కి ఇచ్చే రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేదు” అంటూ అశ్వినీ దత్ చెప్పుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అశ్వినీ దత్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనరల్ గా ఇదివరకు హీరోయిన్ కి వరుస ప్లాప్స్ పడితే ఐరన్ లెగ్ అనేవారని తెలిసిందే. అదిగాక సమీరా తెలుగులో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ కొట్టలేకపోయాయి. మరి నిర్మాత అశ్వినీ దత్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş