iDreamPost
android-app
ios-app

మాస్ కాంబో! హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా!

  • Author ajaykrishna Published - 12:27 PM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 12:27 PM, Wed - 26 July 23
మాస్ కాంబో! హీరో పృథ్వీరాజ్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా!

సాధారణంగా ముందునుండి డైరెక్టర్స్ గా ఉన్నవారు స్టార్ హీరోలతో సినిమాలు తీయడం మామూలే. ఒకవేళ హీరోలే డైరెక్టర్స్ గా మారి.. తమ సినిమాలను తామే తీయడం ఓ రకంగా ఓకే. కానీ.. ఆల్రెడీ ఓ భాషలో స్టార్ అయినటువంటి హీరో డైరెక్టర్ గా.. ఓ పాన్ ఇండియా హీరోతో సినిమా తీయడం అంటే.. ఇది కదా అసలు కిక్కు అనిపిస్తుంది. ఇది కదా.. అసలు ఫ్యాన్స్ కోరుకునే.. ఇండస్ట్రీ ఆశ్చర్యపోయే న్యూస్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారు. ఎందుకంటే.. ప్రభాస్ కి విలన్ గా నటిస్తున్న ఓ స్టార్ హీరో.. తన డైరెక్షన్ లో ఓ గ్యాంగ్ స్టర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు వివరాల్లోకి వెళ్తే.. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాల ద్వారా సుపరిచితమే. అయితే.. పృథ్వీరాజ్ హీరోగా సినిమాలు చేస్తూనే.. లూసిఫర్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. డైరెక్టర్ గా పృథ్వీరాజ్ కు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే.. మోహన్ లాల్ తో బ్రోడాడీ అనే సినిమా చేశాడు. ఇప్పుడు పృథ్వీరాజ్.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉండగా.. నటుడిగా, దర్శకుడుగా స్టార్ అని ప్రూవ్ చేసుకున్న పృథ్వీరాజ్.. డార్లింగ్ ప్రభాస్ తో ఓ భారీ గ్యాంగ్ స్టర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇటీవల ప్రభాస్ ని కలిసినప్పుడు పృథ్వీరాజ్ ఓ గ్యాంగ్ స్టర్ కథను చెప్పాడట. కానీ.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను దృష్టిలో పెట్టుకొని.. తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని టాక్. ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ ప్రెజెంట్ సలార్ ని రిలీజ్ కి రెడీ చేశాడు. మరోవైపు కల్కి, మారుతీ సినిమా, సందీప్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. మరి పృథ్వీరాజ్ డైరెక్టర్ గా ప్రభాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss