Swetha
సినిమాల అసలు రిలీజ్ ల కంటే ముందు ప్రీమియర్లు , పెయిడ్ ప్రీమియర్లు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో ప్రీమియర్ షోస్ వేస్తే జనాలు థియేటర్స్ కు ఎగబడే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కేవలం కొన్ని సెంటర్స్ లో మాత్రమే ఈ ప్రీమియర్ షోస్ ని వేస్తున్నారు.
సినిమాల అసలు రిలీజ్ ల కంటే ముందు ప్రీమియర్లు , పెయిడ్ ప్రీమియర్లు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో ప్రీమియర్ షోస్ వేస్తే జనాలు థియేటర్స్ కు ఎగబడే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కేవలం కొన్ని సెంటర్స్ లో మాత్రమే ఈ ప్రీమియర్ షోస్ ని వేస్తున్నారు.
Swetha
సినిమాల అసలు రిలీజ్ ల కంటే ముందు ప్రీమియర్లు , పెయిడ్ ప్రీమియర్లు జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో ప్రీమియర్ షోస్ వేస్తే జనాలు థియేటర్స్ కు ఎగబడే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. కేవలం కొన్ని సెంటర్స్ లో మాత్రమే ఈ ప్రీమియర్ షోస్ ని వేస్తున్నారు. కొన్ని సినిమాలకు చిత్రబృందం మాత్రమే టీం తో ప్రీమియర్లు వేస్తున్నారు. దీనితో విడుదలకు ముందే టాక్ బయటకు వచ్చేస్తుంది. సినిమాలో కంటెంట్ బావుంటే ఒకే కానీ కాస్త అటు ఇటు అయిందంటే మాత్రం ఆ ఎఫెక్ట్ సినిమాల మీద పడుతుంది.
అప్పట్లో సోషల్ మీడియాకు అంత క్రేజ్ లేదు కాబట్టి.. టాక్ అంత స్పీడ్ గా స్ప్రెడ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా కొద్దీ గంటల్లోనే టాక్ ఏంటి అనేది రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ రివ్యూల వలన సినిమా చూడాలి అనుకునే వారికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. దీనితో ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు ఈ ప్రీమియర్లుకు దూరం అంటున్నాయి. గత వారం రిలీజ్ అయినా సినిమాల విషయంలో ఇదే జరిగింది.
సినిమా మీద బాగా నమ్మకం ఉండడంతో కొంతమంది ప్రీమియర్లు వేయడం , కానీ టాక్ బాగోకపోవడంతో ఆ ఎఫెక్ట్ రెవిన్యూ మీద పడడంతో చాలా మంది నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. సినిమాలు నిజంగా బావుంటే ప్రీమియర్స్ వలన లాభమే జరుగుతుంది. రివర్స్ అయితే డ్యామేజీనే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఈ వారం రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు జాగ్రత్త పడుతున్నాయి. ‘ఘాటీ’కి ప్రీమియర్లు లేవు. ‘మదరాసీ’ది కూడా అదే బాటలో కొనసాగుతుంది. సో రాబోయే రోజుల్లో దాదాపు ఈ ప్రీమియర్లు అంతరించిపోయిన ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.