iDreamPost

ప్రేమించిన అమ్మాయితో ప్రముఖ కమెడియన్ పెళ్లి.. హాజరైన తెలుగు హీరో

Actor Love Marriage: ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, దర్శకుడు సోదరుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రేమించిన అమ్మాయిని మనువాడి హస్బెండ్ క్లబ్ లో చేరిపోయారు. ఈ పెళ్లి వేడుకకు ప్రముఖ తెలుగు హీరో హాజరవ్వడం విశేషం.

Actor Love Marriage: ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, దర్శకుడు సోదరుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రేమించిన అమ్మాయిని మనువాడి హస్బెండ్ క్లబ్ లో చేరిపోయారు. ఈ పెళ్లి వేడుకకు ప్రముఖ తెలుగు హీరో హాజరవ్వడం విశేషం.

ప్రేమించిన అమ్మాయితో ప్రముఖ కమెడియన్ పెళ్లి.. హాజరైన తెలుగు హీరో

ప్రముఖ నటుడు, సింగర్, మ్యూజిక్ కంపోజర్ అయిన ప్రేమ్జీ అమరెన్ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న ఇందు అనే అమ్మాయిని ఇవాళ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ దర్శకుడు, ప్రేమ్ జీ సోదరుడు వెంకట్ ప్రభు షేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. జూన్ 9న ఏ వివాహ వేడుక ఘనంగా జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు రమ్య సుబ్రహ్మణ్యన్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. రమ్య తెలుగులో సంతోష్ శోభన్ నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీలో నటించింది. తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంలో కూడా నటించింది. ఈమె కమెడియన్ ప్రేమ్ జీకి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఈ వేడుకకు వెళ్లారు. వధూవరులతో కలిసి దిగిన ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

కాగా ఈ వేడుకకు ప్రముఖ తెలుగు హీరో కూడా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి తనయుడు, ప్రముఖ హీరో అయిన వైభవ్ ప్రేమ్ జీ వివాహ వేడుకకు హాజరయ్యారు. కోలీవుడ్ యాక్టర్ ప్రేమ్ జీకి, టాలీవుడ్ హీరో వైభవ్ కి ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరిందనే కదా మీ డౌట్. ఈ ఇద్దరూ కలిసి కాస్కో అనే సినిమాలో నటించారు. 2009లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాకి కమెడియన్ ప్రేమ్జీ అమరేన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ పరిచయం కారణంగా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మూవీలో నటిస్తున్నారు. దీనికి దర్శకుడు ప్రేమ్ జీ అమరేన్ అన్న వెంకట్ ప్రభు దర్శకుడు కావడం విశేషం.

నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాకి ఈయనే దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా వెంకట్ ప్రభు పరిచయమయ్యారు. ఇక ప్రేమ్ జీ అమరేన్ కి ఇటు నటనలోనూ, అటు మ్యూజిక్ లోనూ మంచి పట్టు ఉంది. కాగా ఎన్నో ఏళ్లుగా ఇందు అనే అమ్మాయి, ప్రేమ్జీ ప్రేమించుకుంటున్నారు. ఇవాళ ఉదయం సన్నిహితులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు. 2003 నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. ఈయనకు మ్యూజిక్, సింగింగ్ లో కూడా టాలెంట్ ఉండడంతో ఈ విభాగాల్లో సత్తా చాటారు. అనేక సినిమాలకు సంగీత సారధ్యం వహించిన ప్రేమ్జీ.. పలు సినిమాలకు పాటలు కూడా పాడారు.    

 

View this post on Instagram

 

A post shared by Venkat Prabhu (@venkat_prabhu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి