ప్రేమలు మూవీలో నటించిన ఇతని రేంజ్ తెలుసా? ఊహకి కూడా అందని ట్విస్ట్!

ఈ ఏడాది అలరించిన మలయాళ డబ్బింగ్ చిత్రాల్లో ఒకటి ప్రేమలు. ఇందులో హీరో హీరోయిన్లకు ఎంత నేమ్, ఫేమ్ వచ్చిందో.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అంతే పాపులారిటీ వచ్చింది. ఇక ఇందులో అమూల్ డేవిస్ పాత్రలో మెప్పించిన నటుడి గురించి ఈ విషయాలు తెలుసా..?

ఈ ఏడాది అలరించిన మలయాళ డబ్బింగ్ చిత్రాల్లో ఒకటి ప్రేమలు. ఇందులో హీరో హీరోయిన్లకు ఎంత నేమ్, ఫేమ్ వచ్చిందో.. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా అంతే పాపులారిటీ వచ్చింది. ఇక ఇందులో అమూల్ డేవిస్ పాత్రలో మెప్పించిన నటుడి గురించి ఈ విషయాలు తెలుసా..?

ఈ ఏడాది బాక్సాఫీసు మీద తమ డామినేషన్ చూపించాయి మలయాళ చిత్రాలు. మంజుమ్మల్ బాయ్స్, బ్రహ్మయుగం, ప్రేమలు, అన్వేషిప్పిన్ కుండేదుం, గోట్ లైఫ్, ఆవేశం వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీని అందుకున్నాయి. కాసుల వర్షం కురిపించాయి. మాలీవుడ్‌లో మాత్రమే కాకుండా దక్షిణాది ఇండస్ట్రీని షేక్ చేసేశాయి. వాటిల్లో ఒకటి ప్రేమలు. తక్కువ బడ్జెట్ మూవీగా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం. మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజ్ చేయగా హిట్ టాక్ తెచ్చుకుంది. దీన్ని తెలుగులోకి డబ్ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసి తెలుగులోకి రిలీజ్ చేశాడు. మార్చి 9న తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

రూ. 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. మొత్తంగా 130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. ఇక మమితా బైజు కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిపోయింది. భావన స్టూడియోస్ పతాకంపై మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ తెరకెక్కించారు. గిరిష్ ఏడీ దర్శకుడు. ఇందులో నస్లేస్ జి గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సచిన్ సంతోష్ అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.. గేట్ కోచింగ్ కసం హైదరాబాద్ వచ్చి రీతు ప్రేమలో పడతాడు. ఆమె కాదంటోంది. చివరకు ఓకే చెబుతుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్, లవ్ డ్రామాగా తెరకెక్కింది ఈ మూవీ. ఇక ఇందులో హీరోకు ఎంత పేరు వచ్చిందో.. అతడి ఫ్రెండ్ అమూల్ డేవిస్ క్యారెక్టర్‌కు అంతే గుర్తింపు దక్కింది. హీరోయిన్‌ను ప్రేమించేందుకు హీరోకు సలహాలు, సూచనలు ఉంటాయి.

ఆ నటుడు ఎవరంటే సంగీత్ ప్రతాప్. ప్రేమలకు ముందు, ఆ తర్వాత అతడి కెరీర్ ఎలా మారిందో తెలుసా..? గత రెండేళ్లలో నాలుగు సినిమాలు చేస్తే.. ప్రేమలు తర్వాత ఈ ఏడాదిలో మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఈ లెక్కన ప్రేమలు మూవీ తర్వాత అతడు కెరీర్ ఎక్స్ ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సంగీత్ నటుడు మాత్రమే కాదు ఎడిటర్ కూడా. పలు  చిత్రాలకు ఎడిటింగ్ చేశాడు. హృదయం మూవీతో యాక్టర్‌గా మారిన సంగీత్.. పర్తోసింటే పడప్పుకల్, సూపర్ శరణ్య, లిటిల్ మిస్ రాథర్ చిత్రాల్లో నటించాడు. 4 ఇయర్స్, జై గణేష్ చిత్రాలకు ఎడిటర్‌గా మారాడు. అతడ్ని రిజిస్టర్ చేసిన చిత్రం ప్రేమలునే. ప్రస్తుతం బ్రోమాన్స్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రోడ్డు యాక్సిడెంట్ బారిన పడ్డ సంగీత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇతడికి పెళ్లైంది. అతడి భార్య పేరు ఆన్సీ అన్నమ్ సంగీత్.

Show comments