iDreamPost
android-app
ios-app

OTTలోకి ప్రేమలు హీరోయిన్ మలయాళం సినిమా తెలుగులో.. ఎక్కడంటే?

  • Published Jul 25, 2024 | 12:53 PM Updated Updated Jul 25, 2024 | 12:53 PM

హీరోయిన్ మమితా బైజు, రజిషా విజయన్, ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖోఖ. అయితే ఈ సినిమా రిలీజై మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు. కానీ, తాజాగా ఇప్పుడు ఖోఖో సినిమా తెలుగు వెర్షన్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతుంది. ఎక్కడంటే..

హీరోయిన్ మమితా బైజు, రజిషా విజయన్, ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖోఖ. అయితే ఈ సినిమా రిలీజై మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు. కానీ, తాజాగా ఇప్పుడు ఖోఖో సినిమా తెలుగు వెర్షన్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతుంది. ఎక్కడంటే..

  • Published Jul 25, 2024 | 12:53 PMUpdated Jul 25, 2024 | 12:53 PM
OTTలోకి  ప్రేమలు హీరోయిన్ మలయాళం సినిమా తెలుగులో.. ఎక్కడంటే?

మలయాళ కుట్టి ‘మమితా బైజు’ ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ప్రేమలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా అటు మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, భాషల్లో కూడా విడుదలవ్వడంతో.. ఈ బ్యూటీకి నేషనల్ రేంజ్ లో క్రేజ్ పేరిగిపోయింది. కాగా, ఈ సినిమాలో ఈమె అందం, ఆద్భుతమైన నటనతో అబ్బాయిల క్రష్ గా మారిపోయింది మమితా బైజ్. ఇదిలా ఉంటే.. మలయాళంలో ఈ సినిమా కంటే ముందు ఈ బ్యూటీ  కొన్ని సినిమాలు చేసింది. వాటిలో స్పోర్ట్స్ డ్రామాగా 2021లో విడుదలైన ‘ఖోఖో’ మూవీ ఒకటి.  కాగా, ఈ మూవీకి మమితాకు మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇకపోతే  మూడేళ్ల తర్వాత ఖోఖో చిత్రం ఇప్పుడు తెలుగు వెర్షన్ లో ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఇంతకి ఎక్కడంటే..

హీరోయిన్ మమితా బైజు, రజిషా విజయన్, ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖోఖ’. కాగా, ఈ సినిమాకు రాహుల్ రిజి నాయర్ దర్శకత్వం వహించారు.  అయితే ఈ సినిమా అప్పటిలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. మోస్తరు కలెక్షన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా రిలీజై మూడేళ్లు గడుస్తున్న ఇంతవరకు తెలుగు వెర్షన్ రిలీజ్ కాలేదు. కానీ, తాజాగా ఇప్పుడు ఖోఖో సినిమా తెలుగు వెర్షన్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతుంది. కాగా, ఈ మూవీని ఈజీవీ విన్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. అలాగే నేటి నుంచి ఈటీవీ విన్ లో ఖోఖో సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. పైగా ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారకంగా ప్రకటించింది.

అలాగే.. ‘స్కూల్ రోజులను, ఖోఖో గేమ్స్, టీమ్‍మేట్స్‌ను గుర్తు చేసుకోండి. అద్భుతమైన ఖోఖో స్టోరీలైన్‍తో అప్పటి రోజుల్లోకి వెళ్లండి’ అంటూ ట్వీట్ చేసింది. ఇకపోతే ఈ సినిమాలో మమితా బైజూతో పాటు వెంకటేశ్ వీపీ, రంజిత్ శేఖర్, వెట్టుకిలి, రాహుల్ రిజి నాయర్, అరుణ్ రంజన్, శ్రీజిత్ బాబు కీలకపాత్రలు పోషించారు.  అలాగే ఈ ఖోఖో సినిమాకు గాను మమితా బైజూ కు బెస్ట్ సపోర్టింగ్ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది.

ఇక ఖోఖో సినిమా కథ విషయానికొస్తే.. స్కూల్‍లో ఖోఖో జట్టును పీటీ టీచర్ సిద్ధం చేయడం చుట్టూ ఖోఖో సినిమా స్టోరీ సాగుతుంది. ఈ క్రమంలోనే మరియా ఫ్రాన్సిస్ (రజిషా విజయన్) మంచి ప్లేయర్ అయినా కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలలో పీటీ టీచర్‌గా చేరతారు. అయితే జీవితంలో తాను సాధించలేనిది విద్యార్థినులతో సాకారం చేసుకోవాలని అనుకుంటారు. దీంతో ఆ పాఠశాలలో అమ్మాయిలతో ఓ ఖోఖో టీమ్ తయారు చేస్తారు. వారికి శిక్షణ ఇస్తారు. వారి వ్యక్తిగత జీవితాలు కూడా ఈ మూవీలో ఉంటాయి. ఈ ఖోఖో టీమ్‍కు అంజు (మమితా బైజూ) కెప్టెన్‍గా ఉంటుంది. మరీ ఈ టీమ్ ను మరియా విజయవంతంగా ఎలా ముందుకు నడిపారు? ఆమె ఆశలను ఆ ప్లేయర్లు, జట్టు నెరవేర్చిందా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ఖోఖో మూవీ కథ. మరి, ఈ విషయాలన్ని తెలియాలంటే వెంటనే ఖోఖో మూవీని ఓటీటీ చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet