iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రేమలు హీరోయిన్‌కు చేదు అనుభవం.. మరి ఇంత దారుణంగానా!

  • Published Jun 04, 2024 | 9:44 AM Updated Updated Jun 04, 2024 | 9:44 AM

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మమిత బైజుకు దారుణమైన చేదు అనుభవం ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ మమిత బైజుకు దారుణమైన చేదు అనుభవం ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Jun 04, 2024 | 9:44 AMUpdated Jun 04, 2024 | 9:44 AM
వీడియో: ప్రేమలు హీరోయిన్‌కు చేదు అనుభవం.. మరి ఇంత దారుణంగానా!

ప్రేమలు చిత్రంతో మొత్తం దక్షిణాదినే మాయ చేసింది హీరోయిన్‌ మమిత బైజు. ఇక మలయాళ ఇండస్ట్రీలో ఆమె స్టార్‌ హీరోయిన్‌ హోదాను ఎంజాయ్‌ చేస్తోంది. ప్రేమలు సినిమాతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఈ ఒక్క మూవీ ఆమెకు తెలుగు, తమిళ పరిశ్రమలో గుర్తింపుతో పాటు.. వరుస అవకాశాలు క్యూ కట్టేలా చేసింది. ప్రేమలు సినిమా మమిత తొలి చిత్రం కాదు. కానీ ఈ మూవీనే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. 16 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికి మమితకు సరైన గుర్తింపు లభించలేదు. కానీ ప్రేమలు చిత్రంతో ఒక్కసారిగా ఆమె కెరీర్‌కు ఎ‍్కడికో వెళ్లిపోయింది. స్టార్‌డమ్‌ భారీగా పెరిగింది. ఈ క్రమంలో తాజాగా మమితకు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సెలబ్రిటీలు బయట అడుగుపెడితే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురువుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభిమానులు వారిని కలిసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడతారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు బాడీ గార్డ్‌ లేకుండా బయటకు రారు. ఇక తాజాగా మమితకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇటీవల ఈ బ్యూటీ చెన్నై వచ్చింది. అక్కడ ప్రముఖ వీఆర్ మాల్‌లో నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం మమిత ఇక్కడకు విచ్చేసింది. ఈ బ్యూటీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఆమెను దగ్గర నుంచి చూసేందుకు.. ఆమెతో కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

ఈ క్రమంలో మాల్‌ వద్దకు వచ్చిన అభిమానులు మమితను చూసేందుకు, ఆమె దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ గుమిగూడిన జనాన్ని చూసి, మమిత బాడీ గార్డుల మధ్య చాలా భయంతో నడుచుకుంటూ జ్యువెలరీ షాప్‌లోకి వెళ్లింది. పైగా నగల దుకాణం ప్రారంభోత్సవం తర్వాత కూడా.. అంతే స్థాయిలో పెద్ద ఎత్తున జనం ఆమెను చూడడానికి బయట నిలబడి ఉన్నారు. తనను రక్షించడానికి ఎవరూ తన చుట్టూ నిలబడి ఉండకపోతే, ఏమి జరుగుతుందో అనే భయం ఆమెలో కనిపించింది. ఇక మమిత ఇబ్బందికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbettr girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş