iDreamPost
android-app
ios-app

ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం.. కారు ప్రమాదంలో

  • Published May 16, 2024 | 9:51 AM Updated Updated May 16, 2024 | 10:09 AM

మలమాళం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ ప్రేమలు నటుడు మాథ్యూ థామస్‌ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

మలమాళం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ ప్రేమలు నటుడు మాథ్యూ థామస్‌ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published May 16, 2024 | 9:51 AMUpdated May 16, 2024 | 10:09 AM
ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం.. కారు ప్రమాదంలో

ఇటీవలే మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచిన ‘ప్రేమలు’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన ఈ సినిమాను గిరీష్ AD దర్శకత్వం వహించారు. ఇక మలయాళంలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ప్రేమలు సినిమా తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మలమాళ నటుడు థామస్ అనే పాత్రతో ప్రేక్షకుల దగ్గరయ్యాడు నటుడు మాథ్యూ థామస్‌.

అయితే ఆ సినిమాలో తనదైన నటనతో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘మాథ్యూ థామస్‌’.  అయితే తాజాగా ఈ యంగ్‌ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, మాథ్యూ థామస్‌ కుటుంబం ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడి వారి దగ్గర బంధువులు ఒకరు మృతి చెందగా.. థామస్‌ అతని తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు.అయితే ఘటన బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగింది. కాగా, థామస్‌ కుటుంబం తమ బంధువుల కుటుంబంలో ఎవరో మరణించగా.. వారి కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. శస్తాముగల్‌లోని జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కాలువ గుంతలో జీపు బోల్తా పడింది.

అయితే ఆ సమయంలో మాథ్‌యూ సోదరుడు జాన్‌ వాహనం నడుపుతుండగా.. ఆయనకు ఎటువంటి గాయలు కాకపోవడం గమన్హారం. ఇక ప్రమాదంలో మరణించిన వ్యక్తి మామల తురుత్తికి చెందిన రిటైర్డ్ టీచర్ బీనా డేనియల్(61) గా సమాచారం తెలిసింది. కాగా, ఆమెను కూడా ఆసుపత్రికి తరలిచినప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం బీనా భర్త సాజు, మాథ్యూ తల్లిదండ్రులు బిజు, సుసన్‌లకు తీవ్ర గాయలు కావడంతో.. వారిని వారిని ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ విషయం తెలియడంతో మాథ్యూ థామస్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇక మాథ్యూ థామస్ విషయానికొస్తే.. ఆయన బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతేకాకుండా.. లియో సినిమాలో విజయ్‌ దళపతి కొడుకుగా నటించి మెప్పించాడు. ఇక నైమర్‌ అనే సినిమాలో థామస్ హీరోగా కూడా నటించాడు. ఇక ప్రేమలు చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమా హిట్ తరువాత మాథ్యూ థామస్ కు వరుస సినిమాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అతని చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.

 

 

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş