iDreamPost
android-app
ios-app

సలార్ తర్వాత.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ మల్టీస్టారరా..?

  • Author ajaykrishna Published - 08:09 AM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 08:09 AM, Wed - 26 July 23
సలార్ తర్వాత.. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ మల్టీస్టారరా..?

కేజీఎఫ్ సిరీస్ తో ఓ మాసీవ్ యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. యష్ ని రాఖీభాయ్ గా తెరపై ప్రెజెంట్ చేసిన తీరుకు వరల్డ్ వైడ్ యాక్షన్ మూవీ లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ పై అందరి దృష్టిపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా.. కేజీఎఫ్ యూనివర్స్ లో భాగంగా రానుందని తెలుస్తోంది. కాగా.. సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. సలార్ కూడా కేజీఎఫ్ బాటలోనే రెండు భాగాలుగా రానుందని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

ఇక ప్రభాస్ తో సలార్ తర్వాత.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ అధికారికంగా ప్రకటన వచ్చేసరికి.. అటు నీల్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా నీల్, ఎన్టీఆర్ ల ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో, మీడియా వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్న సినిమా.. మల్టీస్టారర్ అంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే కాకుండా మరో హీరో కూడా ఉంటాడని, ఇద్దరినీ పెట్టి.. ప్రశాంత్ పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఓ అడ్వెంచర్ మూవీ తీయనున్నాడని టాక్.

ఈ సినిమా గురించి స్ట్రాంగ్ బజ్ అయితే బయట నడుస్తోంది. పైగా ఎన్టీఆర్ తో సినిమా కూడా కేజీఎఫ్, సలార్ మాదిరిగా రెండు పార్ట్స్ గా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. తనకు జనతా గ్యారేజ్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. మరోవైపు సలార్ 1 తర్వాత.. ప్రశాంత్ సలార్ 2 తీయనున్నాడు. మరి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet