iDreamPost
android-app
ios-app

సలార్ విషయంలో భయంగా ఉంది! ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

సలార్‌ సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే అడ్డు ఉంది. గురువారం అర్థరాత్రి నుంచే కొన్ని ఏరియాల్లో బినిఫిట్‌ షోలు పడనున్నాయి. దాదాపు తెలంగాణలో 20 థియేటర్లలో బెనిఫిట్‌ షోలు ఉండనున్నాయి.

సలార్‌ సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే అడ్డు ఉంది. గురువారం అర్థరాత్రి నుంచే కొన్ని ఏరియాల్లో బినిఫిట్‌ షోలు పడనున్నాయి. దాదాపు తెలంగాణలో 20 థియేటర్లలో బెనిఫిట్‌ షోలు ఉండనున్నాయి.

సలార్ విషయంలో భయంగా ఉంది! ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్- కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కిన సలార్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన రెండు ట్రైలర్లు ఆ అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. అంచనాలకు తగ్గట్టే ప్రీ బుకింగ్స్‌ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే 1 మిలియన్‌కు పైగా ప్రీ బుకింగ్స్‌ను నమోదు చేసింది. పాత రికార్డులను తుడిచి పెట్టేసింది. తెలుగ నాట నిన్నటినుంచి ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యాయి.

మొదలైన కొన్ని గంటల్లోనే సైట్‌ క్రాష్‌ అయ్యేంతలా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సలార్‌ సినిమా శుక్రవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌ టీం.. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా భారతీయ దర్శక దిగ్గజం రాజమౌళికి. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్‌లో సాగుతుంది. ఇంటర్వ్యూ వీడియో ఈ ఉదయం యూట్యూబ్‌లోకి వచ్చింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

 ఇక, ఈ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ‘‘ సలార్‌ సినిమా ప్యూర్‌ డ్రామా సినిమా. కానీ, కొన్ని కారణాల వల్ల ట్రైలర్‌లో అది చూపించలేపోయా. ట్రైలర్‌ చూసి ఇదొక యాక్షన్‌ మూవీ అని పొరపడి ఉండొచ్చు. కానీ, కాదు. ఇందులో అనవసరమైన ఎలివేషన్స్‌, పాటలు కానీ, ఉండవు. ఈ సారి నాకు చాలా భయంగా ఉంది. నా ముందు మూడు సినిమాలు…. రిలీజ్‌కు ముందుకు నాకు నచ్చలేదు. కానీ, ఇది నచ్చింది. అందుకే భయంగా ఉంది’’ అని అన్నారు.

ట్రైలర్‌లో చూసిన దానికి.. ప్రశాంత్‌ నీల్‌ చెబుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇదే ఆయన్ని భయానికి గురి చేస్తోంది. ప్రశాంత్‌ అంటున్నట్లు సలార్‌ సెంటిమెంటల్‌ మూవీ అయినా.. సినిమా మొత్తంలో ప్రభాస్‌ ఎలివేషన్‌ సీన్లు రెండు మూడు ఉన్నా చాలు.. సలార్‌ సూపర్‌ హిట్‌ అవుతుంది. కాగా, సలార్‌ టీం ప్రమోషన్ల విషయాన్ని చాలా లైట్‌ తీసుకుంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఓ పాట, రెండు ట్రైలర్లు, ఓ ఇంటర్వ్యూ మాత్రమే వచ్చాయి.

ఈ రోజు రెండో పాట  కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోం బలే ఫిల్మ్స్‌ కేవలం ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల స్టామినాను నమ్ముకుని సలార్‌ను విడుదల చేస్తోంది. కటౌట్‌ ఉన్నోళ్లకు ప్రమోషన్లు అవసరం లేదని ఫ్యాన్స్‌ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, సలార్‌ ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేయబోతోందని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet