nagidream
ప్రసన్న వదనం మూవీలో హీరో సుహాస్ కి ఉన్న ఫేస్ బ్లైండ్ నెస్ గురించి మీకు తెలుసా? ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? లేదా? వంటి వివరాలు మీ కోసం.
ప్రసన్న వదనం మూవీలో హీరో సుహాస్ కి ఉన్న ఫేస్ బ్లైండ్ నెస్ గురించి మీకు తెలుసా? ఈ వ్యాధి ఎందుకొస్తుందో తెలుసా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి చికిత్స ఉందా? లేదా? వంటి వివరాలు మీ కోసం.
nagidream
ప్రసన్న వదనం మూవీలో సుహాస్ ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటారు. ఫేస్ బ్లైండ్‌నెస్ ని శాస్త్రీయంగా ప్రోసో పగ్నోషియా అని అంటారు. ఇదొక నాడి సంబంధితమైన వ్యాధి. దీని వల్ల ముఖాలను గుర్తుపట్టలేరు. బాగా తెలిసిన వాళ్ళ ముఖాలను కూడా గుర్తుపట్టలేరు. చూడగలరు కానీ ముఖాలను గుర్తుపట్టలేరు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా ఎంత తెలిసినప్పటికీ గుర్తుపట్టలేరు. అదే ఈ ఫేస్ బ్లైండ్‌నెస్ లక్షణం. ఇందులో రెండు రకాలున్నాయి. మొదటిది డెవలప్మెంటల్ ప్రోసో పగ్నోషియా, రెండవది అక్వైర్డ్ ప్రోసో పగ్నోషియా. మొదటి రకమైన డెవలప్మెంటల్ ప్రోసో పగ్నోషియా అనేది బాల్యం ప్రారంభంలో మొదలై జీవితాంతం ఉంటుంది. అయితే ఈ వ్యాధి జనాభాలో 2 నుంచి 2.5 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. రెండో రకం అయిన అక్వైర్డ్ ప్రోసో పగ్నోషియా అనేది బ్రెయిన్ ఇంజ్యూరీ వల్ల వస్తుంది. ముఖ్యంగా స్ట్రోక్, బాధాకరమైన మెదడు గాయం, అల్జీమర్స్ లేయా పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల వల్ల వస్తాయి.
ఈ వ్యాధి వల్ల కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్, లవర్ ని గుర్తుపట్టడంలో స్ట్రగుల్ అవుతారు. అద్దంలో తన ముఖం తాను చూసుకుని గుర్తుపట్టడానికి కూడా ఇబ్బంది పడతారు. కళ్ళు, ముక్కు, నోరు వంటి వాటిని కూడా గుర్తుపట్టలేరు. అంతకు ముందు కలిసిన వారి ముఖాలను కూడా గుర్తుపట్టలేరు. అప్పుడే పరిచయం అయిన వాళ్ళని, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళని గుర్తుపట్టలేరు.
ఈ డెవలప్మెంటల్ ఫేస్ బ్లైండ్ నెస్ ఎందుకొస్తుంది అనే విషయం ఖచ్చితంగా అర్థం కాకపోయినప్పటికీ జన్యుపరమైన కాంపోనెంట్ తో సంబంధం ఉందని చెబుతున్నారు. ఇది తరచుగా కుటుంబాల్లో నడుస్తుందని అంటున్నారు. అక్వైర్డ్ ఫేస్ బ్లైండ్ నెస్ అనేది మెదడులోని ముఖాలను గుర్తుపట్టే నిర్దిష్ట ఏరియాల్లో డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది.
ప్రోసో పగ్నోషియా వచ్చిందో లేదో అనే విషయాన్ని న్యూరాలజిస్ట్ లేదా న్యూరోసైకాలజిస్ట్ నిర్ధారిస్తారు. క్లినికల్ ఇంటర్వ్యూస్ ద్వారా ఆ వ్యక్తి యొక్క చరిత్ర, లక్షణాలు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత కాగ్నిటివ్ టెస్టులు నిర్వహిస్తారు. పలు టాస్కులు, కొలమానాల ద్వారా రోగి ముఖాలను గుర్తించగల్గుతున్నారా లేదా అని చూస్తారు.
ప్రోసో పగ్నోషియా మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి రావటానికి గల ముఖ్య కారణాలను అర్థం చేసుకోవడానికి.. అలానే ప్రభావితం చేసే అంశాల గురించి లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. అలానే ఈ వ్యాధి సోకిన వారికి నిరుత్సాహపడకుండా వారిలో ఆందోళన తగ్గించి, సపోర్ట్ ఇచ్చే దాని మీద అవగాహన పెంచుతున్నారు.
ఫైనల్ గా ఈ ఫేస్ బ్లైండ్ నెస్ కి చికిత్స లేదు. ఇది వచ్చిన వాళ్ళు లైఫ్ లో ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సిందే. ఈ సినిమాలో మన సుహాస్ ఈ ఫేస్ బ్లైండ్ నెస్ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. మరి జనాభాలో 2 శాతం మందికి మాత్రమే వచ్చే ఈ అరుదైన వ్యాధిని బేస్ చేసుకుని సుహాస్ హీరోగా సినిమా వస్తుండడంపై మీ అభిప్రాయమేమిటి? ఈ సినిమా ట్రైలర్ మీకు నచ్చిందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.