iDreamPost
android-app
ios-app

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్స్‌లా ఉంటారన్న కాంగ్రెస్ నేత! హీరోయిన్ ప్రణీత స్ట్రాంగ్ కౌంటర్!

  • Published May 09, 2024 | 12:25 PM Updated Updated May 09, 2024 | 12:25 PM

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. బీజెపీ నేతలు, సోషల్ సైనికులు ఆయన్ను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. బీజెపీ నేతలు, సోషల్ సైనికులు ఆయన్ను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

  • Published May 09, 2024 | 12:25 PMUpdated May 09, 2024 | 12:25 PM
దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్స్‌లా ఉంటారన్న కాంగ్రెస్ నేత!  హీరోయిన్ ప్రణీత స్ట్రాంగ్ కౌంటర్!

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా. భారత దేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురౌతున్నాడు. అంతేకాకుండా బీజెపీ నేతలు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా సరిదిద్దే చర్యలకు ఉపక్రమించింది. అతడి వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. దీంతో శ్యామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా కాంగ్రెస్ వెంటనే ఆమోదించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అంతలా దుమారం రేగడానికి ఈ సీనియర్ కాంగ్రెస్ నేత ఏం వ్యాఖ్యలు చేశాడంటే..?

వారసత్వ పన్నుపై మాట్లాడుతూ.. కొత్త వివాదాన్ని కొని తెచ్చుకున్నారు శ్యామ్. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం గురించి వర్ణించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు గుప్పించేలా మారాయి. ‘తూర్సు భారతీయులు చైనీస్‌లా ఉంటారు, పశ్చిమ దేశ ప్రజలు అరబ్బుల్లా ఉంటారు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్స్‌లా కనిపిస్తారు, ఉత్తరాది ప్రాంత ప్రజలు శ్వేత జాతీయులు మాదిరిగా ఉంటారు. అది పెద్ద విషయం కాదు. కానీ మనమంతా బ్రదర్స్ అండ్ సిస్టర్. పలు భాషల్ని గౌరవిస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజెపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దీనిపై ప్రధాని మోడీ సైతం ఓ సభలో మాట్లాడుతూ..రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు.

ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. తాను సౌత్ ఇండియన్.. తాను భారతీయురాలిగా కనిపిస్తున్నాను.. తన టీంలో ఈశాన్య భారత నుండి సభ్యులు.. భారతీయులుగా కనిపిస్తున్నారు అంటూ కౌంటరిచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రముఖ నటి స్పందించడం విశేషం. తెలుగు వారికి బాపు బొమ్మగా గుర్తిండిపోయే ప్రణీత సుభాష్.. అతడి వ్యాఖ్యలపై ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది. ‘నేను సౌత్ ఇండియన్. నేను భారతీయురాలిగా కనిపిస్తున్నాను’ అంటూ శ్యామ్ పిట్రోడాకు తెలిసేలా హ్యాష్ టాగ్ యాడ్ చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలతో మెరిసిన బ్యూటీ.. 2021లో పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి మలయాళంలో ఓ చిత్రం చేసింది. ఇప్పుడు రావణ అవతార అనే కన్నడ మూవీలో నటిస్తోంది.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom