iDreamPost
android-app
ios-app

ప్రభుదేవా 60వ చిత్రం  ‘వూల్ఫ్’ టీజర్ రిలీజ్.. భయపెట్టేశారుగా..!

  • Published Aug 03, 2023 | 7:31 PM Updated Updated Aug 03, 2023 | 7:31 PM
  • Published Aug 03, 2023 | 7:31 PMUpdated Aug 03, 2023 | 7:31 PM
ప్రభుదేవా 60వ చిత్రం  ‘వూల్ఫ్’ టీజర్ రిలీజ్.. భయపెట్టేశారుగా..!

ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవా ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన పాత్రలో వూల్ఫ్ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని వెల్లడించాడు. పైగా అది ప్రభుదేవా 60వ చిత్రం కావడంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన తర్వాత వూల్ఫ్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఒక పురాణాలు, మంత్రాల నేపథ్యంలో ఈ సినిమా ఉండేలా ఉంది.

ప్రభుదేవా 60వ చిత్రం వూల్ఫ్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉండేలా ఉంది. టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమా మొత్తం బ్లాక్ మ్యాజిక్, మంత్రాలు, ప్రయోగాల నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. పైగా కాస్త హాలీవుడ్ సినిమాల ఫ్లేవర్ కనిపిస్తోంది. కొన్ని షాట్స్ మీకు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి. టీజర్ లో చూపించిన ప్రకారం.. ప్రభుదేవాను అనసూయ, లక్ష్మీరాయ్ మాయచేసి వారి ప్రదేశానికి తీసుకెళ్తారు. వలపు వల విసిరి ప్రభుదేవాను ఒక పావులా వాడుకునేందుకు ప్రయత్నించినట్లు అనిపిస్తోంది. పైగా టీజర్ లో ఒక శవం ఉంటుంది.

ఒకవేళ చనిపోయిన ఒక వ్యక్తిని నిద్రలేపి ప్రభుదేవా ఒంట్లోకి ప్రవేశ పెట్టాలి అని చూస్తున్నట్లుగా ఉంది. మరోవైపు అనసూయ పాత్ర అందరికీ ఆసక్తిని రెకెత్తిస్తోంది. మంత్రిగత్తె గెటప్ లో అనసూయ ప్రేక్షకులకు షాకిచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు కొత్తగా మంత్రిగత్తెగా చేస్తోంది. ఇంక రాయ్ లక్ష్మీ కాస్త గ్యాప్ తర్వాత సినిమా అవకాశం దక్కించుకుందనే చెప్పాలి. ఈ పాన్ ఇండియా సినిమా టీజర్ అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించి. మరి.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom