iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ కృష్ణ స్ట్రాటజీతో వస్తున్న ప్రభాస్.. ఒకేసారి మూడు!

  • Published Aug 31, 2024 | 11:23 AM Updated Updated Aug 31, 2024 | 11:23 AM

Prabhas Strategy And His Upcoming Projects Details: డార్లింగ్ ప్రభాస్ సినిమాల గురించే కాదు.. సినిమాలు చేస్తున్న స్పీడు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా రిలీజ్ చేసేలా ఆయన చేస్తున్నా ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంది చూడండి.

Prabhas Strategy And His Upcoming Projects Details: డార్లింగ్ ప్రభాస్ సినిమాల గురించే కాదు.. సినిమాలు చేస్తున్న స్పీడు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా రిలీజ్ చేసేలా ఆయన చేస్తున్నా ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంది చూడండి.

  • Published Aug 31, 2024 | 11:23 AMUpdated Aug 31, 2024 | 11:23 AM
సూపర్ స్టార్ కృష్ణ స్ట్రాటజీతో వస్తున్న ప్రభాస్.. ఒకేసారి మూడు!

గ్లోబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్.. ఈయనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభాస్ ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా మినిమం పాన్ ఇండియా అవుతుంది. అంతేకాకుండా.. ఒక్కో ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి రిలీజ్ వరకు కనీసం రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నుంచి వచ్చే సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది అంటారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. తన అభిమానుల బాధను అర్థం చేసుకున్న ప్రభాస్ ఇకపై అలా చేయనని.. కనీసం ఏడాదికి ఒక్క సినిమా ఉండేలా చూస్తానంటూ మాటిచ్చాడు. దానికి తగినట్లుగా కష్ట పడుతున్నాడు కూడా. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ స్ట్రాటజీ వాడుతున్నాడు అంటున్నారు.

ప్రభాస్ తన ప్రాజెక్టుల విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు.. చాలా ఫోకస్డ్, ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నాడు. ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ముఖ్యంగా ఒకేసారి కనీసం రెండు సినిమాలు షూటింగ్ జరిగేలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రభాస్ నుంచి వస్తున్న అప్ డేట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది గడవక ముందే అంటే ఏప్రిల్ 10న ది రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాం అంటూ ప్రకటించేశారు. ఇలా కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు. అలా రావాలి అంటే ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు అయినా షూట్ చేస్తూ ఉండాలి. అయితే రెండు కాదు.. ఏకంగా మూడు ప్రాజెక్టులను ఒకేసారి షూట్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడంట.

Prabhas

సూపర్ స్టార్ కృష్ణ స్ట్రాటజీ:

ఇప్పుడు ఉన్న హీరోలు అందరూ సేఫ్ సైడ్ ఒక సినిమా తర్వాత మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ అనౌన్స్ చేసినా కూడా సినిమా పూర్తవ్వకుండా మరో ప్రాజెక్ట్ జోలికి పోవడం లేదు. అదే గతంలో అయితే హీరోలు షిఫ్ట్స్ వారీగా సినిమాలు షూట్ చేసేవారంట. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అలా షిఫ్ట్స్ వారీగా షూటింగ్స్ పూర్తిచేసేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాంటి స్ట్రాటజీని వాడబోతున్నాడు అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఒకేసారి తన మూడు సినిమాలు సెట్స్ మీద ఉండేలా ప్లాన్ చేస్తున్నాడంట. అలా అయితే కచ్చితంగా ఇలాంటి అవసరం రావొచ్చు.

ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ జరుగుతోంది. హను రాఘవపూడితో ప్రాజెక్ట్ అనౌన్స్ అయిపోయింది. మరోవైపు స్పిరిట్ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబరు కల్లా స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలి అని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇవి కాకుండా.. కల్కి పార్ట్ 2, సలార్ 2 కూడా వరుసలో ఉన్నాయి. ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో కనీసం ఒకేసారి 3 సినిమాలు సెట్స్ మీద ఉండేలా ప్రభాస్ ప్లానింగ్ నడుస్తోంది అంటున్నారు. అంతేకాకుండా.. కచ్చితంగా ఒక సినిమా రిలీజ్ తర్వాత ఏడాదిలోపే మరో సినిమా రిలీజ్ అయ్యేలా గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నాడంట. మరి.. ప్రభాస్ ప్లానింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş