iDreamPost
android-app
ios-app

Prabhas: కల్కి సక్సెస్.. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ స్పెషల్ వీడియో! డార్లింగ్ ప్రేమంటే ఇది..

  • Published Jul 15, 2024 | 11:12 AM Updated Updated Jul 15, 2024 | 11:12 AM

Prabhas Special Thanks To Fans: కల్కి 2898 AD మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై తాజాగా స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prabhas Special Thanks To Fans: కల్కి 2898 AD మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై తాజాగా స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 15, 2024 | 11:12 AMUpdated Jul 15, 2024 | 11:12 AM
Prabhas: కల్కి సక్సెస్.. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ స్పెషల్ వీడియో! డార్లింగ్ ప్రేమంటే ఇది..

కొందరు చరిత్రను చదవడానికి పుడితే.. మరికొందరు ఆ చరిత్రను తిరగరాయడానికి పుడతారు. అలా టాలీవుడ్ రికార్డులను తిరగరాయడానికి జన్మించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే వరుస పాన్ ఇండియా చిత్రాలలో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన డార్లింగ్.. తాజాగా కల్కి మూవీతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో రుచిచూపించాడు. ఇప్పటికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇక కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై తాజాగా స్పందించాడు డార్లింగ్ ప్రభాస్. ఫ్యాన్స్ కోసం స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కల్కి 2898 ఏడీ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ.. దూసుకెళ్తోంది. ఒక్క ఇండియాలోనే కాక.. ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపే కలెక్షన్లతో అదరగొడుతోంది. ఇప్పటికే అక్కడ పలు రికార్డులన తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో.. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు థ్యాంక్సు చెబుతూ.. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో..”నాకు ఇంత పెద్ద హిట్ అందించినందుకు అభిమానులందరికీ థ్యాంక్స్. మీ ప్రేమను ఎప్పటికీ మరువలేను. మీరు లేకపోతే నేను జీరోనే. ఇక నాకు ఇంత పెద్ద సినిమాను ఇచ్చినందుకు నాగ్ అశ్విన్ కు స్పెషల్ థ్యాంక్స్. కల్కి కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంత అద్భుతమైన క్వాలిటీతో ఈ రేంజ్ మూవీని అందించిన వైజయంతి మూవీస్ గట్స్ కు హ్యాట్సాఫ్. అశ్వనీదత్ ఈ మూవీకి కోసం ఖర్చుపెడుతున్నదాన్ని చూసి.. నేను మెుదట్లో కంగారుపడ్డాను. ఇదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాను. కానీ ఆయన ఎంతో ధైర్యంతో.. టెన్షన్ పడకు.. గట్టి హిట్ కొడుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు” అంటూ రెబల్ స్టార్ పేర్కొన్నాడు.

ఇక ప్రియాంక, స్వప్నలకు నా స్పెషల్ థ్యాంక్స్,  అలాగే నాతో పాటుగా ఈ చిత్ర విజయంలో భాగస్వాములు అయిన దీపికా, కమల్, అమితాబ్, దిషా పటానీతో పాటుగా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని ప్రభాస్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగిఉండే లక్షణం మా రెబల్ ది అంటూ కితాబిస్తున్నారు. ఇచ్చిన ప్రేమను తిరిగి ఇవ్వడం ప్రభాస్ నైజం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చేసిన స్పెషల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş