iDreamPost
android-app
ios-app

ప్రభాస్ – సందీప్ రెడ్డిల ‘స్పిరిట్’ ఆ పాయింట్ తో రాబోతుందా?

  • Author ajaykrishna Updated - 01:15 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 01:15 PM, Mon - 11 September 23
ప్రభాస్ – సందీప్ రెడ్డిల ‘స్పిరిట్’ ఆ పాయింట్ తో రాబోతుందా?

డెబ్యూ మూవీతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసిన దర్శకుడు.. తదుపరి సినిమాలు ఎలా చేస్తాడనే ఆసక్తి అందరిలో ఉంటుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో అలాంటి పనే చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆరేళ్ళ క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి.. టాలీవుడ్ తో పాటు ఓ రకంగా ఇండియా మొత్తాన్ని షేక్ చేసేసింది. ఎందుకంటే.. అదే స్టోరీతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ రీమేక్ చేశాడు సందీప్. హీరోలు మారారు.. కానీ, స్టోరీ మారలేదు. పైగా తెలుగులో వచ్చిన దానికంటే రెట్టింపు క్రేజ్ సొంతం చేసుకున్నాడు సందీప్. దీంతో తదుపరి సినిమా ఎవరితో అనుకుంటున్న టైమ్ లో బాలీవుడ్ హీరో రణబీర్ తో ‘యానిమల్’ ప్రకటించాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న యానిమల్.. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. యానిమల్ మూవీ వైల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీతో రాబోతుందని.. ఇదివరకు ఏ సినిమాలో చూపించని రక్తపాతాన్ని చూపిస్తున్నట్లు దర్శకుడు సందీప్ ఓ సందర్బంలో చెప్పాడు. ఈ సినిమాకు పిల్లలు తమ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వెళ్లాలని కూడా సూచించారు. అయితే.. అర్జున్ రెడ్డి తర్వాత వస్తున్న యానిమల్ సినిమానే అలా ఉండబోతుంది. అంటే.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ ఊహలకు కూడా అందట్లేదు.

డార్లింగ్ ఫ్యాన్స్ కి సందీప్ పై గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. సందీప్ తన హీరోలను ఇదివరకు చూడని డిఫరెంట్ యాటిట్యూడ్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. రణబీర్ ని ఇన్నాళ్లు సాఫ్ట్ లవర్ బాయ్ రోల్స్ లో చూసిన ఫ్యాన్స్ కి.. యానిమల్ లో ఒక్కసారిగా డేంజరస్ గా మార్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ లో కూడా అలాంటి మ్యాజిక్ ఏదో ఉండబోతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. స్పిరిట్ ఇంకా మొదలు కాలేదు. కానీ.. దానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. స్పిరిట్ లో అసలు ఇంతవరకు చూడని డ్రగ్స్ మాఫియా నేపథ్యం చూపించబోతున్నట్లు టాక్. మరి అందులో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? అసలు సందీప్ డార్లింగ్ ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి స్పిరిట్ గురించి మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.