iDreamPost
android-app
ios-app

సలార్ దెబ్బకి రికార్డ్స్ చెల్లాచెదురు! ఏకంగా RRRని కొట్టేసింది!

  • Published Dec 22, 2023 | 11:25 AM Updated Updated Dec 22, 2023 | 11:25 AM

బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ప్రభస్ నటించిన సలార్ చిత్రం దూసుకెళ్తోంది. ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండడంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకాబోతున్నాయి.

బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ప్రభస్ నటించిన సలార్ చిత్రం దూసుకెళ్తోంది. ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండడంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకాబోతున్నాయి.

  • Published Dec 22, 2023 | 11:25 AMUpdated Dec 22, 2023 | 11:25 AM
సలార్ దెబ్బకి రికార్డ్స్ చెల్లాచెదురు! ఏకంగా RRRని కొట్టేసింది!

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హైవోల్టేజ్ చిత్రం సలార్. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈ మధ్యకాలంలో రెబల్ స్టార్ నుంచి ఈ రేంజ్ సినిమా లేకపోవడంతో కొంత నిరాశ పడిన ఫ్యాన్స్ సలార్ మూవీతో ఆ నిరాశకు చెక్ పెట్టి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక సలార్ తో ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. ఆ రికార్డుల్లో తనను కొట్టే మొనగాడే లేడని రుజువు చేశారు హీరో ప్రభాస్.

సలార్ దెబ్బకు బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు నమోదైన రికార్డ్స్ బద్దలు కాబోతున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ మేనియా చూస్తుంటే రికార్డుల రారాజుగా ప్రభాస్ నిలవబోతున్నారు. బాహుబలి సినిమాతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి సరికొత్త మార్కెట్ ను క్రియేట్ చేశారు ప్రభాస్. ఇప్పుడు మరోసారి సలార్ చిత్రంతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నారు. తెలుగు సినిమా రేంజ్ ను ఆస్కార్ లెవల్ కు తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీ సేల్స్ ను కూడా అధిగమిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. నైజాంలో మరోసారి కింగ్ గా నిరూపించుకుంటున్నారు హీరో ప్రభాస్.

salar movie break all records

హైదరాబాద్ రీజియన్ లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ విషయంలో ఆదిపురుష్ చిత్రం 9.5 కోట్లు, ఆర్ఆర్ఆర్ మూవీ 10.5 కోట్లు రాబట్టాయి. అయితే ఈ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదంటూ అంతా భావించారు. కానీ సలార్ చిత్రంతో సునామీలా ప్రభాస్ ఎగసి పడతారని ఎవరూ ఊహించి ఉండరు. నైజాం ఏరియాలో అడ్వాన్స్ సేల్స్ లో సలార్ 12.2 కోట్లు రాబట్టి సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పటికే ఆడియెన్స్ నుంచి పాసిటీవ్ రెస్పాన్స్ తో హిట్ టాక్ వినిపిస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద సలార్ ఊచకోత మామూలుగా ఉండదని అర్థమైపోయింది.

సలార్ దెబ్బకు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు కాబోతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. సలార్ ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ వసూల్ చేయబోతున్నట్లు టాక్. ఫైనల్ గా సలార్ చిత్రం అడ్వాన్స్ సేల్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసి తిరుగు లేని శక్తిగా బాక్సాఫీస్ పై ప్రభాస్ జెండా పాతనున్నారు. మరి సలార్ రికార్డుల విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet