P Krishna
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 తో యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ మూవీ అంటే చాలు భారీ అంచనాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 తో యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ మూవీ అంటే చాలు భారీ అంచనాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది.
P Krishna
ఇటువంటి సినిమా గురించే ఆలిండియా బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ మొహం వాచిపోయి ఉన్నారు. తమ అభిమాన స్టార్ హీరో మూవీ ట్రైలర్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ప్రభాస్ అభిమాన జనమే కాదు, సగటు ప్రేక్షకుడు కూడా సలార్ ట్రైలర్ చూసి పిచ్చెక్కిపోయారు. దాదాపు 4 నిమిషాల నిడివిలో సాగిన సలార్ ట్రైలర్ నిన్న హోంబలే ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్, ఫృథ్విరాజ్, శ్రుతిహాసన్ కాంబోలో రూపొందిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పూర్తి నిడివి 3 గంటలైతే, ఆ మొత్తం కథ బాగా అర్ధమైన విధంగా ట్రైలర్ ప్రపంచాన్ని ఆకట్టుకుని, అందరినీ సలార్ సినిమా పట్ల వెర్రెక్కించింది. సుమారు 2 ఏళ్ళపాటు రాత్రీపగలు పనిచేస్తే గానీ, నీల్ టీం సలార్ చిత్రాన్ని పూర్తి చేయలేకపోయారు. అంత డెప్త్ ఉన్న కథ అది. చిన్ననాటి స్నేహితుల కథే. కానీ అది జరిగింది మాత్రం ఎక్కడో, ఎప్పుడో వేయి సంవత్సరాల క్రితం జరిగిన మూల కథాంశంతో. ఖన్సార్ అనే క్రూర జంతువులు లాంటి తెగకు చెందినవారి నేపథ్యంలో చోటు చేసుకున్న ఒళ్ళు గగుర్పొడిచే మూలకథతో తయారవడమే సలార్ ప్రత్యేకత. ఎక్కడ నుంచి తెచ్చాడో, ఏ పుస్తకం నుంచి గ్రహించాడో గానీ, గుండెల్సి హోరెత్తించినట్టు, కళ్ళు తిరిగేట్టుంది కథానేపథ్యం.
ట్రైలర్లో చూపించినట్టుగా….వేయి సంవత్సరాల క్రితం మొహమ్మద్ ఘజినీ, చెంగీఝ్ ఖాన్ కన్నా కూడా అత్యంత క్రూరమైన, భయంకరమైన ఆటవిక, అనాగరిక తెగవారి సువిశాలమైన సామ్రాజ్యం. ఎదురొచ్చినవాళ్ళని అక్కడికక్కడే చీల్చిచెండాడి, నరికి ముక్కలు చేసే రక్తపిసాస శాశనాల పర్వం. అథికార కోసం, సింహాసనం కోసం రాజభవనంలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలతో ప్రారంభమైన సినిమాలో కొద్దికాలానికి ఇద్దరు స్నేహితుల మధ్య చిన్ననాటి ప్రేమానుబంధం ఒక్కసారిగా కథను వేరే కోణంలోకి తీసికెళ్తుంది. స్నేహితుడి( ఫృథ్విరాజ్) కోసం ఎరగానైనా, సొరగానైనా మారేంత తెగువ, తెగింపు ఉన్న దేవా(ప్రభాస్) ఉక్రోషం, ఆవేశంతో స్టోరీలైన్ ఊపందుకుటుంది. చివరికి, ప్రభాస్ శత్రువుల కథ ఎలా ముగించాడు…స్నేహితుడికిచ్చిన మాట కోసం ప్రాణాలకు ఎలా తెగించాడు అన్నదే సినిమా కథాంశం. చెప్పడానికి సుళువుగానే కనిపించే కథ. కానీ ప్రశాంత్ నీల్ చేసిన విన్యాసం ఆషామాషీ కాదు. వందల కోట్ల బడ్జెట్ తో, ప్రపంచమే తలమీద పెట్టుకున్న ప్రభాస్ తో, ప్రతీ భాషా సూపర్ స్టార్స్ తో, హయ్యస్ట్ స్టాండర్డ్ టెక్నికల్ వేల్యూస్ తో సలార్ రూపొందించడమంటే కత్తిమీద సామే. దానిని ప్రశాంత్ నీల్ హార్ట్ బీట్ రెట్టింపయ్యే విధంగా తెర రూపం కల్పించడమే సలార్ వెనుక దాగి ఉన్న ఎక్సెలెంట్ ఫీట్.
ట్రైలర్లో ప్రతీ ఫ్రేమ్, ప్రతీ షాట్, ప్రతీ యాంగిల్, అందులో కలర్ కాంబినేషన్స్, లైటింగ్ ఎఫెక్ట్, వాడిన లెన్సెస్ డీప్ ఇంపాక్ట్ దుమ్ము లేచిపోయింది. రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే వందలు, వేలు, లక్షలు, చివరికి మిలియన్స్ లోకి వెళ్ళిపోయాయి వ్యూస్. ట్వీట్స్ తో, మెసేజెస్ తో, కంగ్రాట్స్ తో, అప్రిసియేషన్స్ తో సోషల్ మీడియా వరదగట్టులా తయారైంది. వస్తున్న షాకింగ్ రెస్పాన్స్ కి ప్రభాసే స్వయంగా అదిరిపోయాడు. అందరినీ అడ్రస్ చేస్తూ, ట్రైలర్లో తన డైలాగే…. I kindly request you….we will meet on December 22 అని రాస్తూ ధేంక్స్ చెప్పుకున్నాడు. కెజిఎప్ ఫ్రాంచైజ్ కి మునుపే ప్రశాంత్ నీల్ మనసులో నాటుకున్న కథ సలార్. కానీ, అది సినిమాగా రావడానికి ఏళ్ళు పట్టింది. ఒక మహాద్భుతం తెరమీదకి రావాలంటే అంత వీజీ కాదు కదా. లేట్ గా వచ్చినా, లేటెస్ట్ గా వచ్చింది, వస్తోంది. పైగా, ప్రభాస్ కి ఓ బ్లాక్ బస్టర్ తప్పనిసరైన టైంలో సలార్ రావడమన్నదానికి చారిత్రక అవసరం ఉంది. అందుకే ట్రైలర్ అత్యద్భుతంగా ఉన్న మాట వాస్తవమే అయినా, దానిని మించి రెస్పాన్స్ మిన్ను ముట్టింది.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు వరసగా బాక్సాఫీసు దగ్గరకొచ్చేసరికి జారిపోయాయి.. అనుకున్న స్థాయిలో నిలబడలేదు. ప్రభాస్ స్టేచర్ ని నిలబెట్టలేదు. ప్రభాస్ అభిమానుల గాలి తీసేశాయి. సలార్ మీదనే అందరి కళ్ళు, అందరి ఆశలు. వాటన్నటికీ వంత పాడుతూ, పదింతలు చేస్తూ, ఊపిరి బిగబట్టుకు కుంపటి మీద కూర్చున్న ప్రభాస్ ఫ్యాన్స్ పాలిట సలార్ పెద్ద పండగలా ఉరికింది. ఇంక వాళ్ళకి పట్టపగ్గాలు లేవు. నిన్న రాత్రి ఒక్కడు నిద్రపోతే ఒట్టు. బహుశా ప్రభాస్ ది కూడా అదే పరిస్థితి అయి ఉండొచ్చు. ప్రభాస్ నిర్మాతలకి ఎదురొచ్చిన ఇదొక వరాల వరద. ఢిసెంబర్ 22న తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాక్సాఫీసుకి గట్టి సమాధానమే చెబుతుంది. రికార్డుల ఊచకోతే. ప్రశాంత్ నీల్ గతంలో తీసిన కెజిఎఫ్ రెండు పార్టులు పాత రికార్డుల్ని బద్దలు కొట్టి, కొత్త రికార్డులను తిరగరాసింది. అదే ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న స్టన్నింగ్ ఫిల్మ్ సలార్. అందుకే దీనికంత క్రేజ్, డిమాండ్, గ్లామర్. అన్నిటికీ ధీటుగా ఉంది ట్రైలర్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.