iDreamPost
android-app
ios-app

Salaar OTT: సలార్ OTT డేట్ ఫిక్స్? స్ట్రీమింగ్ అప్పటి నుంచే?

  • Published Jan 16, 2024 | 10:09 PM Updated Updated Jan 16, 2024 | 10:09 PM

సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

Salaar OTT: సలార్ OTT డేట్ ఫిక్స్? స్ట్రీమింగ్ అప్పటి నుంచే?

‘సలార్’.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. భారీ వసూళ్లను సైతం సాధించింది. ప్రభాస్ ను ఎలా చూడని ఫ్యాన్స్ భావించారో అంతకుమించి.. చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక సలార్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? చూద్దామా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. ఈ క్రమంలోనే సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

సలార్.. డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ లో ఉన్న యాక్షన్ యాంగిల్ ను గట్టిగా వాడుకుని అదే రేంజ్ లో గట్టి హిట్ కొట్టాడు. డార్లింగ్ దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాడు. ఇక థియేటర్ లో మిస్ అయినా, చూసిన వాళ్లు కూడా సలార్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ అందింది. సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సలార్ డిజిటల్ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నెట్ ఫ్లిక్స్ సలార్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో త్వరలోనే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. దీంతో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే.. 9వ తారీఖున లేదా 16 తారీఖున స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మరో వారంలో డేట్ పై ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.