iDreamPost
android-app
ios-app

Prabhas-Fauji: అప్పుడు Jr.NTR, బన్నీ.. ఇప్పుడు ప్రభాస్!

  • Published Jul 23, 2024 | 12:24 PM Updated Updated Jul 23, 2024 | 12:24 PM

ప్రభాస్ ఫౌజీ మూవీలో పాత్రకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో బ్రాహ్మణుడిగా ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ ఫౌజీ మూవీలో పాత్రకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో బ్రాహ్మణుడిగా ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas-Fauji: అప్పుడు Jr.NTR, బన్నీ.. ఇప్పుడు ప్రభాస్!

టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్. బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ గా మారుతోంది. తాజాగా మరోవార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని పాత్రను ఈ మూవీలో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫౌజీలో బ్రాహ్మణుడి రోల్ లో డార్లింగ్ కనిపించనున్నాడట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ పోషించే పాత్రపై ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ పూజారి కొడుకుగా డార్లింగ్ ఇందులో కనిపిస్తాడని సమాచారం. అయితే ఇలాంటి పాత్ర చేయడం ప్రభాస్ ఇదే మెుదటిసారి. కాగా.. గతంలో అదుర్స్ లో జూనియర్ ఎన్టీఆర్, డీజే మూవీలో అల్లు అర్జున్ లు బ్రాహ్మణుడి పాత్రలతో అభిమానులను మెస్మరైజ్ చేశారు. అయితే ఆ కథలకు తగ్గట్లుగా అందులో ఫన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ హనురాఘవపూడి సినిమాల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ప్రభాస్ ఈ రోల్ లో ఎలా కనిపిస్తాడు? డైరెక్టర్ ఎలా చూపిస్తాడు? అన్న క్యూరియాసిటి అభిమానుల్లో నెలకొంది.

ఇండిపెండెంట్ రాక ముందు జరిగే ఈ కథలో సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక హను సినిమాల్లో ప్రేమ కథలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. పైగా హీరోయిన్ల పాత్రలను మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దడంలో ఆయన సిద్దహస్తుడు. ఆ విషయం సీతారామంతో పాటుగా గత సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ ను తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ బ్యూటీ సజల్ అలీని కూడా మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. మరి ఇటు సైనికుడిగా, అటు బ్రాహ్మణుడిగా ప్రభాస్ ఏ మేరకు అభిమానులను మెప్పిస్తాడో వేచిచూడాలి. అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.