iDreamPost
android-app
ios-app

రిలీజ్ కి ముందే పిచ్చెక్కిస్తున్న సలార్ రికార్డులు.. ఇదీ ప్రభాస్ రేంజ్!

Salaar Movie Breaking Records: ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇండియన్ సినిమాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Salaar Movie Breaking Records: ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇండియన్ సినిమాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

రిలీజ్ కి ముందే పిచ్చెక్కిస్తున్న సలార్ రికార్డులు.. ఇదీ ప్రభాస్ రేంజ్!

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తోందంటే వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానుల్లో ఒక సందడి నెలకొంటుంది. నిజానికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎదురుచూపులు మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆ హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే సలార్ సినిమా టికెట్స్ కోసం అభిమానులు ఏ రేంజ్ లో కుస్తీలు పడుతున్నారో మన అందరికీ తెలిసిందే. బుక్ మై షోలో థియేటర్ రిలీజ్ చేయగానే నిమిషాల వ్యవధిలో హౌస్ ఫుల్ బోర్డులు వచ్చేస్తున్నాయి. ఇంక థియేటర్లలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. రిలీజ్ కాకుండానే సలార్ రికార్డులు నమోదు చేస్తోంది.

సాధారణంగా డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. సినిమా టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు బద్దులు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ డాషింగ్ కాంబోలో సలార్ వస్తున్న నేపథ్యంలో ఆ హైప్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది. ఎంతలా అంటే.. సినిమా రిలీజ్ కూడా కాకుండానే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాద్షాతో కూడా ప్రభాస్ పోటీకి దిగాడు. డంకీ సినిమాకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉత్తరాధిలో కూడా ప్రభాస్ కంప్లీట్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలో ప్రభాస్ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

విషయం ఏంటంటే సలార్ సినిమా కోసం తొలిరోజు దేశవ్యాప్తంగా 30.25 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. అంతేకాకుండా ఇవి ఐనాక్స్, పీవీఆర్, సినీపోలిస్ లాంటి మల్టీప్లెక్స్ చైన్స్ కాకుండానే సలార్ సినిమా ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలో ఇది సరికొత్త బెంచ్ మార్క్ అంటున్నారు. రిలీజ్ కి ముందే ఇలాంటి ఒక రికార్డును క్రియేట్ చేసిన సలార్ మూవీ.. రిలీజ్ అయ్యాక ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో అని బాలీవుడ్ లో చిన్న బెరుకు మొదలైంది అంటున్నారు. ఒకవైపు డంకీ సినిమాతో షారుక్ ఖాన్ వచ్చినా కూడా ప్రభాస్ ఈ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అంటే అది చిన్న విషయం కాదు. అదికూడా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, మీడియా సమావేశాలు ఏమీ లేకుండా ఇలాంటి ఒక నంబర్ రీచ్ అయ్యారంటే అది ప్రభాస్- ప్రశాంత్ నీల్ ఇమేజ్ అనే చెప్పాలి.

నార్త్ లో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ బేస్, ప్రశాంత్ నీల్ సినిమాలకు ఉండే హైప్ కి కలిపి.. ఈ రికార్డు క్రియేట్ చేశారు. ఇంక డిసెంబర్ 22 తర్వాత బాక్సాఫీస్ వద్ద సలార్ వేట మొదలవుతుందనే చెప్పాలి. ఓపెనింగ్స్, డే1 కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ అంటూ.. ఇలా రికార్డులు రాసుకుంటూ పోవాల్సి వస్తుందేమో. ఇంక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇది సార్ మా ప్రభాస్ రేంజ్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఇంక ఈ సినిమాపై వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. మరి.. సలార్ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet