iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ‘కల్కి’ మహాభారతంతో మొదలు

  • Published Feb 26, 2024 | 10:54 AM Updated Updated Feb 26, 2024 | 4:00 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరింత ఎక్స్​పెక్టేషన్స్ పెంచేశారు. ఈ సినిమా గురించి ఆయన ఇచ్చిన ఓ కొత్త అప్​డేట్ బజ్​ను నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరింత ఎక్స్​పెక్టేషన్స్ పెంచేశారు. ఈ సినిమా గురించి ఆయన ఇచ్చిన ఓ కొత్త అప్​డేట్ బజ్​ను నెక్స్ట్ లెవల్​కు తీసుకెళ్లింది.

  • Published Feb 26, 2024 | 10:54 AMUpdated Feb 26, 2024 | 4:00 PM
ప్రభాస్ ‘కల్కి’ మహాభారతంతో మొదలు

ప్రస్తుతం టాలీవుడ్ నుండే కాదు మొత్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం మల్టీ-పార్ట్ సిరీస్‌గా రానుందని సమాచారం. కాగా, ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండగా ఆయన సరసన దీపికా పదుకోణ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి’పై ఉన్న హైప్ ని అమాంతం పెంచేశారు. తన సినిమా మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని నాగ్ అశ్విన్ తెలిపారు.

ఇప్పటికే ‘కల్కి’లో ఇతర ప్రధాన పాత్రల్లో బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దిషా పటాని, దుల్కర్ సల్మాన్ తో పాటు కీలకమైన అతిథి పాత్రల్లో ఇంకా చాలా మంది స్టార్స్‌తో సహా భారీ తారాగణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక, నాగ్ అశ్విన్ తాజా స్టేట్​మెంట్​ తో అభిమానులని ఇంకా ఉత్సాహపరిచారు. మహాభారత కాలంలో ప్రారంభమై 2898లో సినిమా ముగుస్తుందని తెలిపిన నాగ్ అశ్విన్ తాజా మీడియా సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన థీమ్‌ కాన్సెప్ట్ ను అధికారికంగా వెల్లడించారు. అందుకే ‘కల్కి 2898 AD’ అనే టైటిల్‌ని ఎంచుకున్నామని కూడా తెలిపారు.

‘కల్కి’లో హైందవ ఇతిహాసాలు, చరిత్ర నుంచి కొన్ని అంశాలను తీసుకున్నారన్న వార్త ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కలియుగం చివర్లో చెడును అంతం చేయడానికి వస్తానని చెప్పిన మహావిష్ణువు.. 10వ అవతారమైన కల్కి కథ ఆధారంగా సినిమా తెరకెక్కిందనే భారీ బజ్ ఉంది. ఈ వార్తలన్నీ నిజమైతే గనక ‘కల్కి 2898 AD’ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ‘కల్కి’ టీమ్ మార్చిలో పూర్తి స్థాయి ప్రమోషన్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి.. ‘కల్కి 2898 AD’ సినిమా పై మీరెన్ని భారీ అంచనాలు పెట్టుకున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఈ వారం OTTల్లోకి 32 సినిమాలు.. ఆ రెండు ప్రత్యేకం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom