P Krishna
Kalki 2898 AD Movie: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తుంది. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.
Kalki 2898 AD Movie: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తుంది. ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.
P Krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన రేంజ్ ఏంటో చూపిస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే సొంతమైన రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తుంది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి నుంచి మొదలైన రికార్డుల పర్వం ఇంకా కొనసాగుతుంది.యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ షేక్ చేస్తూ రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంనం సృష్టిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్‌లో ఈ మూవీ చేరింది. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ మరో రికార్డు సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2998 ఏడి’ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికు 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఉత్తర అమెరికాలో భారీ వసూళ్లు చేసిన ఇండియన్ రెండో సినిమాగా నిలిచింది. బాహుబలి మొదటి స్థానంలో ఉంది. తాజాగా ప్రభాస్ తన కెరీర్ లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ టికెట్స్ బుక్ చేసుకునే ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షో లో రిలీజ్ కి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజు నుంచి నిన్నటి వరకు దాదాపు మూడు వారాలు అవుతున్నా అత్యధిక టికెట్స్ సేల్స్ అమ్ముడవుతూనే ఉన్నాయట. ఇప్పటి వరుకు ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కి ముందు, రిలీజ్ మూడు వారాల తర్వాత టికెట్లు అమ్ముడు పోలేదని బుక్ మై షో యాజమాన్యం తెలిపారు.
బుక్ మై షో ‘కల్కి 2998 ఏడి’మూవీకి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన్పటి నుంచి తమ ఫ్లాట్ ఫామ్ లో అమ్ముడుపోయిన టికెట్ల రేట్ల వివరాలను ప్రకటించింది. ‘కల్కి 2998 ఏడి’ టికెట్ బుకింగ్స్ జూన్ 23 నుంచి ప్రారంభించగా.. మొదటి రోజే 328K అమ్ముడు పోయాయి. అంటే దాదాపు 3 లక్షల 28 వేల టికెట్లు. ఆ రోజు నుంచి మొదలుకొని జూన్ 27న ఏకంగా 11 లక్షల 20 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. రిలీజ్ తర్వాత 11 లక్షల 72 వేల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇవన్నీ దేశ వ్యాప్తంగా చూపించిన లెక్కులు. అయితే బుక్ మై షో నుంచి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ నుంచి మొత్తం ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడైనట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలోనే ‘కల్కి 2998 ఏడి’ ఏ మూవీ సృష్టించని రికార్డు సృష్టించింది. ఒక సినిమాకు అత్యధికంగా ఆన్ లైన్ ద్వారా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ అమ్ముడు కావడం ఇదే మొదటి సారి అని యూనిట్ ప్రకటించింది. ఈ రకంగా చూస్తూ ముందు ముందు మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.