iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో వ్యక్తిని గుర్తుపట్టారా..? అంత పెద్ద మూవీ తీసి.. ఇంత సింపుల్‌గా ఎలా..?

  • Published Aug 19, 2024 | 12:38 PM Updated Updated Aug 19, 2024 | 12:38 PM

ఈ ఫోటోలో గుండుతో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..? బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కానీ అతడు మాత్రం చాలా కామ్ అండ్ కూల్. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం...?

ఈ ఫోటోలో గుండుతో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..? బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కానీ అతడు మాత్రం చాలా కామ్ అండ్ కూల్. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం...?

  • Published Aug 19, 2024 | 12:38 PMUpdated Aug 19, 2024 | 12:38 PM
ఈ ఫోటోలో వ్యక్తిని గుర్తుపట్టారా..? అంత పెద్ద మూవీ తీసి.. ఇంత సింపుల్‌గా ఎలా..?

ఈ ఫోటోలో వైట్ షర్ట్ వేసుకుని, గుండుతో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా..? అత్యంత సాదాసీదాగా కనిపిస్తున్న అతడు స్టార్ డైరెక్టర్ అంటే నమ్ముతారా..? నిజమేనండి.. ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ తీసి సెన్సేషన్ డైరెక్టర్ అయ్యాడు. కేవలం మూడంటే మూడు సినిమాలను తెరకెక్కించి హాలీవుడ్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనెవరో చెబితే మీరు ఖంగుతినడం ఖాయం. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరంటే.. కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టిన నాగ్ అశ్విన్. కల్కి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ప్రస్తుతం ఆథ్యాత్మిక సేవలో మునిగి తేలుతున్నాడు. తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నాడు. ఇదిగో ఇలా గుండులో కనిపించేది మన న్యాగీ మామనే.

అరుణాలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఆ ఫోటోలను షేర్ చేసుకన్నాడు నాగ్ అశ్విన్. ఆ ఫోటోలే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు పొడవాటి జుట్టుతో, గుబురు గడ్డంతోనే దర్శనమిచ్చిన ఆయన.. ఇప్పుడు ఇలా కనిపించే సరికి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. కల్కి మూవీ స్టార్టింగ్ నుండి ఇలాగే కనిపించిన ఈ స్టార్ డైరెక్టర్.. సినిమా విడుదలై సక్సెస్ కావడంతో అరుణాచలేశ్వరుడ్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా  ఇలా కనిపించడంతో దర్శకుడ్ని త్వరగా పోల్చుకోలేకపోతున్నారు అభిమానులు. మొత్తానికి ఈ కొత్త గెటప్‌తో మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు న్యాగీ.  నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలానికి ఇలా తలనీలాలు సమర్పించాడు నాగీ. ఇక కల్కి 2898 ఏడీ మూవీ విషయానికి వస్తే 50 రోజులు పూర్తి చేసుకుని థియేటర్లలో ఇంకా కొనసాగుతుండటం విశేషం.

nag ashwin kalki director

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకు మెయిన్ ఫిలర్స్. ఈ గ్లోబల్ రేంజ్ స్టార్స్ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి క్రెడిట్ నాగ్ అశ్విన్‪కే చెల్లుతుంది. దీపికా పడుకొనే, దిశా పటానీ అందాలు, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, అనుదీప్, ఫరియా అబ్దుల్లా క్యామియోస్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయి. రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 1100 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది. కాస్తంత గ్యాప్ తీసుకుని కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడు న్యాగీ. ఇక ఈ మూవీలో ఓటీటీలోకి కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఆగస్టు 22న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 27న మూవీ విడుదల కాగా, సుమారు రెండు నెలలకు ఓటీటీ ప్రేక్షకులను కనువిందు చేసేందుకు వచ్చేస్తుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş