iDreamPost
android-app
ios-app

సర్జరీ చేయించుకోనున్న ప్రభాస్! టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

  • Author ajaykrishna Published - 11:45 AM, Sat - 12 August 23
  • Author ajaykrishna Published - 11:45 AM, Sat - 12 August 23
సర్జరీ చేయించుకోనున్న ప్రభాస్! టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కెరీర్ లో బిగ్గెస్ట్ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్.. ఈ ఏడాది ఆదిపురుష్ తో అలరించాడు. ఇప్పుడు మరో రెండు బిగ్గెస్ట్ సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. త్వరలోనే షూటింగ్స్ ముగించుకొని సర్జరీ చేయించుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ప్రెజెంట్ వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసుకున్న సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. వీటిలో ముందుగా సలార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన సలార్.. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు చేసింది. కాగా.. ఈ సినిమా కేజీఎఫ్ సిరీస్ కి కొనసాగింపుగా వస్తుందని టాక్ నడుస్తుంది. మరోవైపు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. కల్కి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమా.. టైటిల్ టీజర్ తో ఊహించని అటెన్షన్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనేతో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ నటిస్తున్నారు. కాగా.. సైన్స్ ఫిక్షన్ జానర్ కి.. మైథాలజీ జోడించి రూపొందిస్తున్నాడు నాగ్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్.. మారుతీతో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే.. వీలైనంత త్వరగా సలార్, కల్కి షూటింగ్ పనులు ముగించుకొని.. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాడట. కొన్నాళ్ళుగా డార్లింగ్ మోకాలు సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. అందుకే ముందుగా మోకాలి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా.. ప్రభాస్ కి సర్జరీ అని తెలిసి అభిమానులు కంగారు పడిపోతున్నారు. కానీ.. పెద్దగా టెన్షన్ పడే విషయం కాదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. మరి పాన్ ఇండియా రేంజ్ హీరో కాబట్టి.. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించక తప్పదు. ఆరోగ్యం బాగుంటేనే కదా సినిమాలు చేయగలిగేది అని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు. మరి డార్లింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş