iDreamPost

ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రేర్ వీడియో! నిజమైన బాహుబలిలా!

  • Published Jun 19, 2024 | 2:20 PMUpdated Jun 19, 2024 | 2:20 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కంటే ముందు దశాబ్ద కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన రేర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఆయనను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కంటే ముందు దశాబ్ద కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన రేర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఆయనను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

  • Published Jun 19, 2024 | 2:20 PMUpdated Jun 19, 2024 | 2:20 PM
ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రేర్ వీడియో! నిజమైన బాహుబలిలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చే పేరు ‘ప్రభాస్’. ఇక పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అంతేకాకుండా.. వరల్డ్ వైడ్ గా డార్లింగ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అయితే సినీ ఇండస్ట్రీలో ఆయనకంటే ముందు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. కాగా, ఆయన దశాబ్ద కాలంలో ప్యాన్ ఇండియా ప్రొడ్యుసర్ గా మంచి పేరును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని అప్పటిలో యంగ్ డైనమిక్ ప్రొడుస్యర్ గా ఈయనకు మంచి ఘనత ఉంది. ఇంతకి ఆయన మరెవరో కాదు డార్లింగ్ ప్రభాస్ తండ్రి ‘ఉప్పలపాటి సూర్యనారయణ రాజు’. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ అరుదైన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇక ఆ వీడియోలో పొడుగుగా చాలా హ్యాండ్ సమ్ గా.. చూడటానికి ప్రభాస్ లాగే కనిపిస్తున్నా వ్యక్తే సూర్యనారయణ రాజు.

ప్రస్తుతం ఆయనకు సంబంధించిన అరుదైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో  చూసిన నెటిజన్స్ , ఫ్యాన్స్ ప్రభాస్ అచ్చం ఆయన తండ్రిలానే ఉన్నారని.. ఆ అందం, కట్ అవుట్ అన్ని తండ్రి పోలీకలే ఫ్రింట్ గా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా.. యంగ్ ఏజ్ లో సూర్యనారయణ అచ్చం హీరోలా చాలా అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్ కాబట్టి, ప్రభాస్ కూడా రెబల్ స్టార్ కృష్ణ రాజ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని చాలామంది అనుకుంటారు.కానీ, నిజానికి ప్రభాస్ తండ్రికి కూడా ఇండస్ట్రీతో మంచి అనుబంధాలు ఉన్నాయి.కాగా, ఇప్పటిలో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా ఎంత క్రేజ్ ఉందో.. అప్పటిలో ఆయన తండ్రికి కూడా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవల్ లో మంచి గుర్తింపు ఉంది.

అయితే ఆయన మొదటగా.. 1974లో కృష్ణవేణి సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు.. ఆ తర్వాత భక్త కన్నప్ప, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. కానీ, ఎక్కువ శాతం సూర్యనారయణ తన అన్నయ్య కృష్ణం రాజుకు అండగా గోపి మూవీస్ పతాకంపై కృష్ణంరాజు నటించిన చిత్రాలనే నిర్మించేవారు. అయితే ఇప్పటి ప్రేక్షకులకు ఈయన గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ, ప్రభాస్ హీరోగా అయిన తర్వాత మాత్రం సూర్యనారయణ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.అయితే ప్రభాస్ స్టార్ గా ఎదిగిన సమయంలో అనగా 2010 ఫిబ్రవరి 12న ఆయన మరణించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్,నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి సినిమాలో నటించాడు. కాగా, ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి పోస్టర్, ట్రైలర్ రిలీజై భారీ రెస్పాన్స్ రావడంతో.. అందరికి ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇందులో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ తండ్రి సూర్యనారయణ రాజు రేర్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి