Somesekhar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ రిలీజ్ సందర్బంగా డార్లింగ్ ఫ్యాన్స్ అఖండ అన్నదానాన్ని నిర్వహించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ రిలీజ్ సందర్బంగా డార్లింగ్ ఫ్యాన్స్ అఖండ అన్నదానాన్ని నిర్వహించారు.
Somesekhar
సలార్, ప్రభాస్.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన సలార్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.. డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నడూ చూడని విధంగా ప్రభాస్ ను ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోనా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇక మీరే ఊహించుకోండి ఏర్పాట్లు ఎలా ఉంటాయో. అలాంటి ఏర్పాట్లనే చేశారు భీమవరం డార్లింగ్ అభిమానులు. సలార్ విడుదల సందర్భంగా ఏకంగా అఖండ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కించాడు. డిసెంబర్ 22(శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కైతే థియేటర్లలో పూనకాలనే తెప్పిస్తోంది. తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. సలార్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో ఆయన అభిమానులు పండగ వాతావరణం సృష్టించారు. తమ అభిమానాన్ని తెలియజేస్తూ.. భారీ కటౌట్స్ తో పాటుగా తమ భారీ హృదయాలను కూడా తెలియజేస్తూ.. ఏకంగా 1500 మందికి అఖండ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భీమవరం ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్నదానాన్ని నిర్వహించారు.
కాగా.. గతంలో కూడా ప్రభాస్ కు సంబంధించిన ఏ చిన్న వేడుకనైనా ఓ రేంజ్ లో నిర్వహిస్తారు ఇక్కడి ఫ్యాన్స్. అలాంటిది చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ హిట్ అందుకున్న తమ హీరో కోసం ఆ మాత్రం అన్నదానం నిర్వహించలేమా అంటూ ఏకంగా అఖండ అన్నదానాన్నే ఏర్పాటు చేశారు. ఇక సలార్ విషయానికి వస్తే.. రెండు పార్ట్ లుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అందులో భాగంగా తొలి భాగం తాజాగా విడుదలై ఇండియా వైడ్ గా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మరి సలార్ విడుదల సందర్భంగా 1500 మందికి డార్లింగ్ ఫ్యాన్స్ అన్నదానం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.