సాధారణంగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఎన్నో పడరాని పాట్లు పడాలి. డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాక రాత్రి పగలు కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి నిద్రాహారాలు కూడా మానాల్సి వస్తుంది. ఇన్ని కష్టాలకు ఒర్చుకుని సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే.. తాము పడ్డ కష్టాలన్ని మర్చిపోయి, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక సినిమా స్టాఫ్ కు షూటింగ్ మెుత్తం పూర్తి అయిన తర్వాత గిఫ్ట్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దసరా మూవీకి పనిచేసిన స్టాఫ్ కు గొల్డ్ కాయిన్స్ ఇచ్చింది కీర్తి సురేష్. తాజాగా ప్రభాస్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. సలార్ మూవీ స్టాఫ్ కు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి మూవీస్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే సలార్ మూవీకి పని చేస్తున్న వారందరికి ఒక్కొక్కరికి రూ. 10 వేలను వారి ఖాతాల్లో జమచేశారు.
ఇక సినిమా కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసిన ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సలార్ మూవీకి పనిచేస్తున్న స్టాఫ్ కు ఆర్థిక సాయం చేయడంతో.. ఒక్కసారిగా డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. షూటింగ్స్ ఉంటేనే కడుపునింపుకునే వారికి ఇలా సాయం చేయడంతో.. పెదనాన్నకు తగ్గ కొడుకు అంటూ నెటిజన్స్ పొగుడుతున్నారు.