iDreamPost
android-app
ios-app

CM రేవంత్​కు ప్రభాస్ పెద్దమ్మ సర్​ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చారంటే..?

  • Published Aug 19, 2024 | 9:50 PM Updated Updated Aug 19, 2024 | 9:50 PM

Prabhas Aunty Shyamala Devi Gift To CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ ఓ సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ బహుమతి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Prabhas Aunty Shyamala Devi Gift To CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ ఓ సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ బహుమతి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 19, 2024 | 9:50 PMUpdated Aug 19, 2024 | 9:50 PM
CM రేవంత్​కు ప్రభాస్ పెద్దమ్మ సర్​ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చారంటే..?

ఒక్కో సినిమాతో తన రేంజ్​ను పెంచుకుంటూ పోతున్నారు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్టంరాజు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఆయన.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. ‘కల్కి 2898 ఏడీ’తో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్​కు ఆయన ఎదిగారు. ఇండియన్ సినిమాను ఏలుతున్న ఈ హీరోను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ లిస్ట్​లో తాను కూడా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రభాస్​ గురించి ఓ సభలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే మీటింగ్​లో రేవంత్​కు ప్రభాస్ పెద్దమ్మ నుంచి సర్​ప్రైజ్ గిఫ్ట్ అందింది.

గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్​కు అభినందన సభ జరిగింది. ఈ మీటింగ్​లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పాల్గొన్నారు. రేవంత్​ను కలసిన ఆమె స్వయంగా బహుమతి అందజేశారు. తాపేశ్వరం నుంచి తెప్పించిన బాహుబలి కాజాను ముఖ్యమంత్రికి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే గిఫ్ట్స్ అంటే మినిమం ఓ రేంజ్​లో ఉంటాయని అంటున్నారు. ఇక, గచ్చిబౌలి సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమతో పాటు ప్రభాస్, డైరెక్టర్ ఆర్జీవీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడని ఆయన మెచ్చుకున్నారు.

హాలీవుడ్​ను ఢీకొట్టే సత్తా టాలీవుడ్​కు ఉందని ప్రభాస్ నిరూపించాడని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ‘బాహుబలి’ సినిమాను ప్రభాస్ లేకుండా ఊహించలేమని పేర్కొన్నారు. కృష్ణంరాజు లేకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకోవడం కుదరదన్నారు. డైరెక్టర్ ఆర్జీవీ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు రేవంత్. ఇక, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్​లను లైన్​లో పెడుతున్నారు. హను రాఘవపూడితో చేయబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. అటు ‘రాజాసాబ్’ షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు ప్రభాస్. ‘కల్కి 2’తో పాటు ‘సలార్ 2’ పైప్​లైన్​లో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడాలి.