iDreamPost
android-app
ios-app

Prabhas: గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్! కేరళ వరద బాధితులకు రూ. 2 కోట్ల భారీ విరాళం!

  • Published Aug 07, 2024 | 11:15 AM Updated Updated Aug 07, 2024 | 11:15 AM

కేరళ వరద బాధితుల కోసం భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటీ, నటులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.

కేరళ వరద బాధితుల కోసం భాషతో సంబంధం లేకుండా అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటీ, నటులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.

Prabhas: గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్! కేరళ వరద బాధితులకు రూ. 2 కోట్ల భారీ విరాళం!

కేరళలోని వయనాడ్ లో వరదలు సృష్టించిన బీభత్సం అంతా.. ఇంతా కాదు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది ఆచూకీ కూడా లభ్యం కాలేదు. రెస్క్యూ టీమ్ ఇప్పటికీ తమ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఇక ఈ ఊహకందని విపత్తు వల్ల నష్టపోయిన బాధితుల కోసం సినీ పరిశ్రమ ముందుకు కదిలింది. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించి.. తమ గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి చేరాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కేరళలోని వయనాడ్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా నష్టపోయిన బాధితులకు నేనున్నానంటూ ముందుకొచ్చి ఏకంగా రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు డార్లింగ్ ప్రభాస్. ఈ మెుత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించాడు ప్రభాస్. దాంతో అతడిపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకునే వాడే నిజమైన హీరో అంటు పొగుడుతున్నారు. ప్రభాస్ తో పాటు ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ భారీ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

కేరళ వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కలిసి రూ. కోటి విరాళం ఇచ్చారు. మిగిలిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్ రూ. 25 లక్షలు. సూర్య ఫ్యామిలీ రూ. 50 లక్షలు, రష్మిక మందన్న రూ. 10 లక్షలు, చియాన్ విక్రమ్ రూ. 20 లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షల సాయన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు. వీరితో పాటుగా ఇంకొందరు కూడా విరాళాలు అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు. మరి కేరళ వరద బాధితులకు ఏకంగా 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రభాస్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.