iDreamPost
android-app
ios-app

యువ హీరో, అతడి తండ్రిని కొట్టి చంపిన జనాలు.. అసలేం జరిగిందంటే!

  • Published Aug 07, 2024 | 9:14 AM Updated Updated Aug 07, 2024 | 9:14 AM

Bangladesh-Actor Shanto Khan, His Father Death: సినీ ఇండస్ట్రీలో దారుణం చోటు చేసుకుంది. యువ హీరో, అతడి తండ్రి, నిర్మాతను జనాలు కొట్టి చంపారు. ఆ వివరాలు..

Bangladesh-Actor Shanto Khan, His Father Death: సినీ ఇండస్ట్రీలో దారుణం చోటు చేసుకుంది. యువ హీరో, అతడి తండ్రి, నిర్మాతను జనాలు కొట్టి చంపారు. ఆ వివరాలు..

  • Published Aug 07, 2024 | 9:14 AMUpdated Aug 07, 2024 | 9:14 AM
యువ హీరో, అతడి తండ్రిని కొట్టి చంపిన జనాలు.. అసలేం జరిగిందంటే!

సినిమా హీరోలంటే మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. వారిని ప్రత్యక్షంగా చూడటం, వారితో ఫొటో దిగడం కోసం అభిమానులు ఎగబడతారు. ఇక మన దేశంలో హీరోలకు ఉండే క్రేజ్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. వారిని దేవుళ్లతో సమానంగా కొలుస్తారు అభిమానులు. తమ ఫేవరెట్‌ హీరోను ఎవరైనా చిన్న మాట అంటే చాలు.. యుద్ధానికి వస్తారు ఫ్యాన్స్‌. ఇక సోషల్‌ మీడియా వేదికగా హీరోల అభిమానుల మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి. హీరోలంటే మనకు అంత పిచ్చి. వారికి చిన్న ఇబ్బంది వచ్చినా.. ఫ్యాన్సే బాధపడతారు. కానీ ఓ చోట మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ప్రజలే హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపారు. మరి ఇంత దారుణం జరగడానికి కారణం ఏంటంటే..

ఈ దారుణం ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. పక్క దేశం బంగ్లాదేశ్‌లో. ప్రస్తుతం అక్కడ ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం కాస్త.. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి.. ఏకంగా దేశం విడిచి పోయే పరిస్థితులు వచ్చాయి. బంగ్లాలో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. ఏకంగా ప్రధాని అధికారిక నివాసంలోకి చేరి.. గందరగోళం సృష్టించారు ఆందోళనకారులు. తిన్నారు, తాగారు.. అందినకాడికి దోచుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అంతేకాక స్టార్‌ క్రికెటర్‌ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఇక తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. యువ హీరో, అతడి తండ్రిని కొట్టి చంపారు బంగ్లా జనాలు. ఈ సంఘటన సంచలనంగా మారింది.

Peoples kill bangladesh actor and his father

బంగ్లాలో క్రేజీ ప్రాజెక్ట్స్‌కు నిర్మాతగా వ్యవహరిస్తూ.. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత సలీంఖాన్‌, అతడి కుమారుడు, హీరో షాంటో ఖాన్‌ను అల్లరిమూకలు దారుణంగా చంపేశాయి. కొన్నాళ్ల క్రితమే సలీంఖాన్‌ తన కొడుకు షాంటో ఖాన్‌ను హీరోగా పరిచయం చేశాడు. ఇప్పుడిప్పుడే అతడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దారుణం విషయానికి వస్తే సలీం ఖాన్‌, ఆయన కుమారుడు సోమవారం సాయంత్రం చాంద్‌పూర్‌ అనే ప్రాంతం నుంచి పారిపోతుండగా.. బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్‌ మార్కెట్‌లో ప్రజలు వీళ్లపై ఆగ్రహానికి గురయ్యారు. వారి నుంచి తప్పించుకోవడానికి సలీం ఖాన్‌ పిస్టల్‌ పేల్చి.. అక్కడి నుంచి తండ్రి కొడుకులిద్దరూ తప్పించుకున్నారు. కానీ దగ్గర్లోని బగారా మార్కెట్‌ దగ్గరికి వచ్చేసరికి జనాలు భారీ ఎత్తున్న పోగయ్యారు. వారంతా ఈ తండ్రీకొడుకులపై దాడి చేసి దారుణంగా చంపేశారు.

ఇక సలీం, అతడి కుమారుడి మరణం గురించి నటుడు దేవ్‌ స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి నాకు ఒక చేదు వార్త తెలిసింది. ప్రముఖ నిర్మాత సలీం మృతి చెందారని దాని సారాశం. అల్లరి మూకలు సలీం, ఆయన కుమారుడు షాంటోని దారుణంగా చంపేశారని తెలిసింది. ఈవిషయాన్ని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. బంగ్లాదేశ్‌లో తిరిగి శాంతియుత పరిస్థితులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సలీమ్‌ విషయానికి వస్తే.. అతడు షాప్లా మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. అగ్ర నటీనటులతో సినిమాలు కూడా తీశారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.