iDreamPost
android-app
ios-app

Prabhas : కమర్షియల్ వైపే చూస్తున్న ప్రభాస్

  • Published Mar 31, 2022 | 3:08 PM Updated Updated Mar 31, 2022 | 3:08 PM
Prabhas : కమర్షియల్ వైపే చూస్తున్న ప్రభాస్

ఉట్టి విజువల్ గ్రాండియర్స్ అంటూ ప్రచారంలో ఊదరగొడుతూ కథా కథనాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో సాహో, రాధే శ్యామ్ లు నిరూపించాక డార్లింగ్ ప్రభాస్ కి తత్వం బోధపడినట్టు ఉంది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ఇలాంటివి ఇంకో రెండొస్తే చాలానే క్లారిటీ వచ్చేసింది. అందుకే మెల్లగా కమర్షియల్ డైరెక్టర్స్ మీద దృష్టి సారిస్తున్నాడు. అందులో భాగంగానే త్వరగా పూర్తి చేసే షరతు మీద దర్శకుడు మారుతీకి రాజా డీలక్స్ (ప్రచారంలో ఉన్న టైటిల్) ఆఫర్ ఇచ్చాడు. ఇది అతి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కెలు యధావిధిగా కంటిన్యూ అవుతాయి.

ఇవి కాకుండా కొరటాల శివతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఎందుకంటే ఈ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మిర్చి ఇప్పటికీ అభిమానులకు ఫేవరెట్ మూవీ. మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారాని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో నిజమైతే అంతకన్నా గుడ్ న్యూస్ వాళ్లకు ఇంకేముంటుంది. అయితే ఇదంత ఈజీ కాదు. కొరటాల ఆచార్య రిలీజ్ అయ్యాక జూన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు మొదలుపెట్టాలి. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. దానికో ఆరేడు నెలలు, ప్రమోషన్లు గట్రా అన్ని కలుపుకుంటే ఏడాదిపైగానే అవుతుంది. ఈలోగా ప్రభాస్ పైన చెప్పిన మూడులో రెండు పూర్తి చేస్తారు.

సో ఛాన్స్ అయితే ఉంది. రాధే శ్యామ్ వల్ల విపరీతమైన నష్టాలు చవిచూసిన యువి క్రియేషన్స్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లతో ఎక్కువ రికవరీ ఆశిస్తోంది. అందులో భాగంగానే ఈ కాంబో కోసం చర్చలు జరిగాయట. రచయితగా ఉన్న కొరటాల శివను నమ్మి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది యువినే. దాని వల్ల వచ్చిన పేరుతోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లను డీల్ చేసే అవకాశం దక్కింది. అందుకే వాళ్ళు అడిగితే శివ నో చెప్పరు. కాకపోతే అతిశయోక్తుల లేని మిర్చి లాంటి పవర్ ఫుల్ సబ్జెక్టు అయితేనే ఇది క్లిక్ అవుతుంది. ఈ విషయంలో మాస్టర్ అయిన కొరటాల శివకు మనం ప్రత్యేకంగా చెప్పాలా. ఆయనకాయనే సాటి

Also Read : John Abraham : జాన్ అబ్రహం నోటి తీట