iDreamPost
android-app
ios-app

గీతాంజలి మరణంపై ఆ లీడర్ ఎందుకు మౌనం? పూనమ్ కౌర్ సంచలన ట్విట్

  • Published Mar 13, 2024 | 4:54 PM Updated Updated Mar 13, 2024 | 5:18 PM

Poonam Kaur Tweet: గీతాంజలి మరణం వ్యవహారం సోషల్ మీడియాలో అట్టుడికిపోతుంది. ఈ వ్యవహారంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన ట్విట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Poonam Kaur Tweet: గీతాంజలి మరణం వ్యవహారం సోషల్ మీడియాలో అట్టుడికిపోతుంది. ఈ వ్యవహారంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన ట్విట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

గీతాంజలి మరణంపై ఆ లీడర్ ఎందుకు మౌనం? పూనమ్ కౌర్ సంచలన ట్విట్

ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. త్వరలో ఏపిలో ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే తెనాలికి చెందిన గీతాంజలి అనే వివాహత మరణం వ్యవహారం ఏపీలో పెద్ద దుమారమే రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ సాగుతుంది. టీడీపీ, జనసేన కు చెందిన వారు ట్రోలింగ్ చేయడం వల్ల మనస్థాపానికి గురై గీతాంజలి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పపడిందని వైఎస్సాఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ లీడర్ ఇప్పటి వరకు స్పందించడం లేదని నటి పూనమ్ కౌర్ ట్విట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా.. తర్వాత సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించిన పూనమ్ కౌర్ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పలు సంచలన ట్విట్స్ తో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనులపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పూనమ్ కౌర్ తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య అంశంపై సంచలన ట్విట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

గీతాంజలి మౌనంపై వైఎస్ షర్మిల ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ‘తోటి మహిళలు, చిన్నారుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం మహిళా నేతల కనీస లక్షణం, బాధ్యత. తెలుగు రాష్ట్రాల్లో అట్టుడికిపోతున్న గీతాంజలి అంశంపై వైఎస్ షర్మిల ఇంకా మౌనంగా ఉండటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలనాలిలోని సాదారణ మహిలళు, బాలికలు బయటకు వచ్చి పాఠాలు ఇలాంటి వారికి నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటూ పోస్ట్ చేసింది. గీతాంజలిని ఆ పరిస్థితికి తీసుకు వచ్చిన ప్రతి ఒక్కరికి చట్టపరమైన శిక్ష విధించాలి. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై దర్యాప్తు జరిపించాలి. అమ్మాయిలపై పుకార్లు పుట్టించి, వేధించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ తన ట్విట్ లో కోరింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు వైఎస్ షర్మిల మాత్రం స్పందించలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.