iDreamPost
iDreamPost
ఇటీవలే పూజా హెగ్డేని వరుస డిజాస్టర్లు పలకరించడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య మూడు ఒకదాన్ని మించి మరొకటి థియేటర్లలో బోల్తా కొట్టడమే కాదు ఆయా హీరోల కెరీర్స్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ గా నిలవడం మరింత బాధ పెట్టే అంశం. మొన్నటిదాకా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూజాకి ఇప్పుడివి ఉన్నట్టుండి బ్రేక్ వేసేవి కాదు కానీ ఎంతో కొంత గ్రాఫ్ మీద ప్రభావం చూపించేవే. ఇలాంటి పరిస్థితుల్లో తనకో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు రావాల్సిందిగా పూజాకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. భారతదేశ ప్రతినిధిగా తను అక్కడ హాజరు కాబోతోంది.
ఇది అందరిని పిలిచే వేడుక కాదు. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సోనమ్ కపూర్, కంగనా రౌనత్, ప్రియాంకా చోప్రా లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఆ చిత్రోత్సవ రెడ్ కార్పెట్ మీదే నడిచే భాగ్యాన్ని అందుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పూజా హెగ్డే ఇలా వెళ్తున్న మొదటి ప్యాన్ ఇండియా స్టార్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కేన్స్ కు మన దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు లేరు. కేవలం బాలీవుడ్ నే నిర్వాహకులు ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. కానీ ఇటీవలి బాక్సాఫీస్ పరిణామాలతో పాటు ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి సినిమాలు వరల్డ్ వైడ్ అందుకున్న ఆదరణ వాళ్ళ దృష్టి కోణాన్ని మార్చాయని చెప్పొచ్చు.
అక్కడ ఎన్నో గొప్ప సినిమాలు ప్రదర్శిస్తారు. పూజ హెగ్డే హాజరు ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దీవాలి కూడా కమిట్ అయ్యింది. ఇదింకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. రణ్వీర్ సింగ్ తో చేసిన సర్కస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. కెరీర్ మొదలుపెట్టిన తొలిదశలో ఐరన్ లెగ్ అనిపించుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు కేన్స్ కి గెస్ట్ గా వెళ్లడం దాకా పూజా హెగ్డే కెరీర్ మిగిలినవాళ్లకు స్ఫూర్తిదాయకమే