P Krishna
Anasuya Sengupta: ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మంగా జరుగుతుంది. ఈ ఏడాది 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేశారు.
Anasuya Sengupta: ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మంగా జరుగుతుంది. ఈ ఏడాది 77 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేశారు.
P Krishna
కేన్స్ సిటీలో ప్రతి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వివిధ భాషల చిత్రాలకు, చిత్ర యూనిట్ సభ్యులకు అవార్డులు ఇస్తుంటారు. కేన్స్ ఫెస్టివల్ లో ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి సినీ ప్రముఖులు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు సందడి చేస్తుంటారు. ఇక్కడ అందాల తారలు రెడ్ కార్పేట్ పై వివిధ రకాల డిజైరింగ్ డ్రెస్సులతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఈ ఏడాది భారత్ తరుపు నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో పాటు కియారా అద్వాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా ధూళిపాల వెళ్లారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ చిత్రాలకు ఎంపిక పెరిగిపోతుంది. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. వివరాల్లోకి వెళితే..
కేన్స్ నగరంలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతుంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి సినీ ప్రముఖులు, మోడల్స్, ఇతర రంగాలకు చెందిన వారు ఇక్కడ సందడి చేస్తున్నారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న తొలి మహిళగా అనసూయ నిలిచారు. బల్గేరియన్ డైరెక్టర్ కాన్ స్టాంటిన్ బొజనోవ్ ‘ది షేమ్ లెస్ ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈచిత్రంలో నటించిన అనసూయ కు ఈ అవార్డు దక్కింది. ఈ మూవీలో ఆమె ‘రేణుక’ అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ చిత్రం భారత్, నేపాల్ లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ఎంపికైంది.. ప్రదర్శించబడింది.
పశ్చిమ బెంగాల్ కోల్‌కొతా కి చెందిన అనసూయ ముంబై లో ప్రొడక్షన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారింది. బొజనోవ్ ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్.. అలా వీరిద్దరి పరిచయం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. నటిగా ఆమె తొలి ప్రయత్నంలోనే కేన్స్ లో అవార్డు దక్కించుకుంది.. అంతేకాదు మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. రేణుక అనే వేశ్య ఢిల్లీలో ఓ బ్రోతల్ హౌజ్ లో పోలీస్ ని చంపి పారిపోతుంది. అక్కడ నుంచి ఆమె సె*క్స్ వర్కర్ల కమ్యూనిటీ లో ఆశ్రయం పొందుతుంది..అక్కడ 17 ఏళ్ల దేవికతో ప్రేమలో పడుతుంది.. తర్వాత వీరిద్దరూ తమ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ..? వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారు అన్నదే కథా నేపథ్యం.